Begin typing your search above and press return to search.
స్టైలిష్ ట్రెండీ లుక్కులో సర్కార్ బ్యూటీ!
By: Tupaki Desk | 16 April 2021 10:30 AM GMTసినీ ఇండస్ట్రీలో టాలెంట్ తో పాటు అందంతో కూడా మెస్మరైజ్ చేసే హీరోయిన్ చాలామంది ఉంటారు. వారంతా సినిమాల్లో తప్పితే బయట పెద్దగా కనిపించరు. కానీ సినిమా ఫంక్షన్స్ లో మాత్రం అభిమానులను కలుసుకునే అవకాశం వస్తుంది. అందులోను కలవడం అంటే ఏముండదు. స్క్రీన్ మీద కాకుండా కళ్లకు ఎదురుగా కనిపిస్తే చాలు ఫ్యాన్స్ అలా గాల్లో తేలిపోతారు. తాజాగా సౌత్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్ కనిపించే సరికి అభిమానులలో అలాంటి భావనే కలిగింది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పుడు చూసిన కీర్తి.. ఇప్పుడు చూస్తున్న కీర్తి చాలా డిఫరెంట్ గా కనిపించడం ప్రత్యేకత. మొదట్లో కేవలం చుడిదార్స్, సారీస్ అంటూ కనిపించింది కీర్తి.
కానీ ఇప్పుడలా కాదు. అప్పటిలా బొద్దుగా కూడా లేదు. సినిమా సినిమాకి అమ్మడు నాజూకుగా తయారవుతుంది. అందులోను ఇప్పుడిప్పుడే గ్లామర్ టచ్ ఉన్న క్యారెక్టర్స్ కూడా చేస్తోంది. మెల్లగా అభిమానులు కోరుకున్న దారిలోకి వస్తుందంటూ టాక్. ఇదిలా ఉండగా.. తాజాగా కీర్తి లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చేతిలో హ్యాండ్ బాగా పట్టుకొని స్టైల్ గా ఫోటోలకు పోజిచ్చింది కీర్తి. లైట్ గ్రీన్ టి-షర్ట్, స్టైలిష్ బెలూన్ ప్యాంటు ధరించి కనిపించే సరికి కుర్రకారు కళ్ళప్పగించి చూస్తున్నారు. తాజాగా కీర్తి 99సాంగ్స్ అనే సినిమా ప్రీమియర్ వేడుకలలో పాల్గొంది. అక్కడే ఈ స్టైలిష్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో దర్శనమిచ్చింది. ప్రస్తుతం అమ్మడిని చూస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే కీర్తి ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తోంది.