Begin typing your search above and press return to search.
బాబోయ్ కీర్తి.. ఏంటీ ఈ అవతారం?
By: Tupaki Desk | 24 April 2021 5:31 AM GMTమహానటి తర్వాత సౌత్ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తిసురేష్. ప్రస్తుతం టాలీవుడ్ మరియు కోలీవుడ్ ల్లో సూపర్ స్టార్ లకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్ బ్యాక్ టు బ్యాక్ బడా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దంగా ఉంది. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చేస్తున్న సర్కారు వారి పాట మరియు తమిళంలో చేస్తున్న అన్నాత్తే సినిమాలు ఈమె స్థాయిని మరింత పెంచడం ఖాయం. కీర్తి సురేష్ కొత్త సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆమె ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కీర్తి సురేష్ మరీ సన్నబడిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈమె నెట్టింట షేర్ చేసిన ఫొటోలపై నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. మరీ ఇంత సన్నగా మారావ్ ఏంటీ కీర్తి అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏంటీ ఈ అవతారం అంటూ ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. కీర్తి సురేష్ మహానటి సినిమా సమయంలో ఉన్న లావుతో పోల్చితే ఇప్పుడు మరీ సన్నగా అయ్యింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆమె వేసుకున్న డ్రస్ లో మరింత సన్నగా కనిపిస్తుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.