Begin typing your search above and press return to search.

తన ఫస్ట్ 'సాలరీ' ఎంతో చెప్పిన స్టార్ హీరోయిన్..!

By:  Tupaki Desk   |   4 May 2021 8:31 AM GMT
తన ఫస్ట్ సాలరీ ఎంతో చెప్పిన స్టార్ హీరోయిన్..!
X
దక్షిణాది కుర్ర హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్.. మహానటి సినిమాతో ఒక్కసారిగా ఫేమ్ లోకి వచ్చినటువంటి అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది. అలాగే వరుసగా నటించిన సినిమాలను విడుదలకు సిద్ధం చేస్తోంది. చేతినిండా సినిమాలు కలిగిన కీర్తి.. ఓవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూనే మరోవైపు హీరోల సరసన కూడా నటిస్తుంది. అయితే ఈ భామ నేనుశైలజ, నేనులోకల్, మహానటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిందో లేదో.. కీర్తి కొద్దికాలంలోనే తెలుగు కుర్రకారును ఫిదా చేసేసింది.

ఇంతవరకు సినిమాల్లో ఎలాంటి స్కిన్ షో గాని, గ్లామర్ రోల్స్ జోలికి వెళ్లకుండానే కీర్తి అవకాశాలను తన ఖాతాలో వేసుకుంటుంది. ప్రస్తుతం ఈ వయ్యారి చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'సర్కారు వారి పాట', నితిన్ సరసన 'పవర్ పేట' సినిమాలతో పాటు 'గుడ్ లక్ సఖి' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా ఉంది. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతుంది. ఇక ఈ విషయాలు పక్కన పెడితే కీర్తి మొదటి నుండి కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ వస్తుంది. తాజాగా అమ్మడు తాను తీసుకున్నటువంటి ఫస్ట్ శాలరీ గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

అయితే కీర్తి మాట్లాడుతూ.. తాను ఎప్పుడైనా ఏది సంపాదించినా తన తండ్రి చేతికే ఇచ్చేదాన్ని అంటోంది. అప్పట్లో నిర్మాతలు డబ్బులు కవర్ లో పెట్టి ఇచ్చేవారు. ఆ కవర్ తీసుకెళ్లి నేరుగా మా నాన్న చేతిలో పెట్టేదాన్ని. కనీసం అందులో ఎంత అమౌంట్ పెట్టరానేది కూడా చూసేదాన్ని కాదు. అయితే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసేటప్పుడు ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. అప్పుడు వారు 500/- రూపాయలు ఇచ్చారు. నాకు తెలిసి నేను తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ అదే. ఇక్కడ విషయం ఏంటంటే.. ఆ 500 కూడా తీసుకెళ్లి మా నాన్నకే ఇచ్చేసా." అని చెప్పుకొచ్చింది కీర్తి. ప్రస్తుతం అమ్మడు సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.