Begin typing your search above and press return to search.

అదృష్టం పైడిప‌ల్లి రూపంలో వ‌రించింది

By:  Tupaki Desk   |   26 May 2021 11:30 PM GMT
అదృష్టం పైడిప‌ల్లి రూపంలో వ‌రించింది
X
గ‌త కొంత‌కాలంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా కెరీర్ ప‌రంగా త‌న స్థాయికి త‌గ్గ ప్రాజెక్టులు ద‌క్క‌డం లేద‌న్న అసంతృప్తి కీర్తి సురేష్ లో ఉంది. మ‌హానటి త‌ర్వాత స్టార్ హీరో స‌ర‌స‌న ఆఫ‌ర్ ద‌క్కించుకునేందుకు చాలా కాలం వేచి చూడాల్సి వ‌చ్చింది. ఆ క్ర‌మంలోనే ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌ర‌స‌న స‌ర్కార్ వారి పాట‌లో కీర్తి అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇప్పుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ స‌ర‌స‌న మ‌రోసారి న‌టించే అవ‌కాశం ద‌క్కించుకోనుంద‌ని తెలిసింది.

ఈ చిత్రానికి వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మ‌హేష్ .. చ‌ర‌ణ్ లాంటి స్టార్ల‌కు స్క్రిప్ట్ వినిపించిన వంశీ పైడిప‌ల్లి ఫైన‌ల్ వెర్ష‌న్ స్క్రిప్ట్ తో మెప్పించ‌డంలో త‌డ‌బ‌డ్డారు. కానీ ద‌ళ‌ప‌తితో అంత‌కుమించిన బిగ్ ప్రాజెక్ట్ ని అత‌డు ఖాయం చేసుకున్నారని తెలుస్తోంది. విజ‌య్ హీరోగా పైడిప‌ల్లి భారీ పాన్ ఇండియా చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. మహేష్ బాబుతో అతను చేయాలనుకున్నదానికంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ కానుంది. కరోనా సంక్షోభం తగ్గిన తర్వాత అధికారిక ప్రకటన చేస్తార‌ని తెలిసింది. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

కీర్తి సురేష్ ఇంతకు ముందు విజయ్ తో కలిసి రెండు సినిమాల్లో నటించారు. ఇది హ్యాట్రిక్ మూవీగా రికార్డుల‌కెక్క‌నుంది. ప్ర‌స్తుతం పైడిప‌ల్లి స్క్రిప్ట్ కి తుది మెరుగులు దిద్దుతున్నార‌ని స‌మాచారం.