Begin typing your search above and press return to search.
ప్రయోగాలు వికటిస్తే ప్రమాదం కీర్తి!
By: Tupaki Desk | 2 March 2021 1:30 PM GMTకీర్తి సురేశ్ ను తెరపై తొలిసారిగా చూసిన కుర్రాళ్లు కొబ్బరి ముక్కలా .. కోవాబిళ్లలా ఉందనుకున్నారు. ఆలస్యం చేయడం ఎందుకని ఆ క్షణం నుంచే ఆమె అభిమానులుగా మారిపోయారు. అప్పటి నుంచి ఆమె సినిమాలు .. ఆ గ్యాపులో ఆమె ఫొటోలు చూస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు. ఆమె బూరబుగ్గలు .. కోర చూపులను తలచుకుంటూ ఊహల్లో తేలిపోతున్నారు .. కలల్లో మునిగిపోతున్నారు. కుర్రాళ్లంతా ఆమెను ఆరాధించడమే పనిగా పెట్టుకుంటే, మీ పని మీరు కంటిన్యూ చేయండి అంటూ .. ఆమె తన పని తాను చూసుకుపోతోంది.
తెలుగులో చాలా తేలికగా స్టార్ డమ్ ను సంపాదించుకున్న ఈ అమ్మాయి, తమిళ .. మలయాళ భాషల్లోను అదే దూకుడు చూపించడం విశేషం. అయితే 'మహానటి' తరువాత ఆమె ఎక్కువగా నాయిక ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడం, పాత్రల ఎంపికలో శ్రద్ధ పెట్టకపోవడం అభిమానులను నిరాశ పరిచింది. 'మిస్ ఇండియా'లో 'టీ' కాన్సెప్టును పట్టుకుని, ఇంటర్వెల్లోనే అందరితో ఆమె కప్పులకొద్దీ 'టీ' తాగించింది. 'మహానటి' టైటిల్ వెనుక సావిత్రి ఉంది .. అందువలన థియేటర్లను ప్రేక్షకులు ముంచెత్తారు. మిగతా కథల విషయంలో అలా జరగదనే విషయం కీర్తి సురేశ్ కి కాస్త ఆలస్యంగా అర్థమైంది. దాంతో ఆమె మళ్లీ స్టార్ హీరోల చేయి చేయి పట్టుకుని ఆడిపాడటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
'పెంగ్విన్' .. 'మిస్ ఇండియా' ఆర్డర్ లోనే కీర్తి 'గుడ్ లక్ సఖి' అనే సినిమాను కూడా పూర్తిచేసింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమాను, జూన్ 3వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా నిర్మాతలు ప్రకటించారు. నాగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఆది పినిశెట్టి .. జగపతిబాబు కీలకమైన పాత్రలను పోషించారు.
అయితే ఈ ప్రాజెక్టు కీర్తి సురేశ్ ఏమైనా హెల్ప్ అవుతుందా అనే అభిమానులు ఆలోచిస్తున్నారు. ముందుగానే లేడీ ఓరియెంటెడ్ కథలు చేసిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతూ వచ్చి ఖాళీ అయ్యారు. అవకాశాలు తగ్గుతున్నప్పుడు లేడీ ఓరియెంటెడ్ కథలవైపు వెళ్లినవాళ్లు బిజీ అయ్యారు. ఈ సత్యాన్ని గ్రహించకుండా ప్రయోగాలకు వెళితే ప్రమాదమని వాళ్లు ఆమెను హెచ్చరిస్తున్నారు. 'సర్కారువారి పాట' తప్ప ఇప్పుడు ఆమెకి ఏదీ వినిపించదేమో!