Begin typing your search above and press return to search.
కీర్తి సురేశ్ కి గండం గడిచినట్టే!
By: Tupaki Desk | 29 March 2021 8:05 AM GMTకీర్తి సురేశ్ .. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు తెరపై చాలా తక్కువ సినిమాలతో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్సులో ఆమె ఒకరు. బంగినపల్లి మామిడి పండులా కనిపించే ఈ అమ్మాయికి, తొలి సినిమాతోనే కుర్రాళ్లంతా అభిమానులుగా మారిపోయారు. విడుదలైన రోజునే ఆమె సినిమా చూసేవారి జాబితాలో ఉత్సాహంగా చేరిపోయారు. 'మహానటి' సినిమాతో కీర్తి సురేశ్ కి బ్రహ్మరథం పట్టారు .. ఆమె కీర్తిని సరిహద్దులు దాటించారు. ఇంత తక్కువ అనుభవం కలిగిన అమ్మాయి, సావిత్రిలా నటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆటాపాటలకి పరిమితమయ్యే గ్లామర్ డాల్ కాదు .. కీర్తిలో చాలా కంటెంట్ ఉందనే విషయం అందరికీ అర్థమైంది.
అయితే 'మహానటి' తరువాత ఈ అమ్మాయి తెలుగులో చెప్పుకోదగిన సినిమా చేయలేదు. అందువలన ఆ స్థాయికి దగ్గరలో హిట్టు కూడా ఆమెకి దొరకలేదు. దాంతో కీర్తి అభిమానులంతా చాలా నిరాశ చెందారు. కీర్తి తమిళ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం .. తెలుగులో ఆమె గ్రాఫ్ ను పెంచే సినిమాలు పడకపోవడం అభిమానులకు అసంతృప్తిని కలిగించింది. ఈ నేపథ్యంలో వచ్చిన 'మిస్ ఇండియా' చూసి, కుర్రాళ్లు కోమాలోకి వెళ్లేంత పనిచేశారు. 'టీ' తాగుతూ సినిమా చూడొచ్చుగానీ, 'టీ' గురించి సినిమా చేయడం కరెక్టు కాదనే విషయం ఆమెకి కూడా కాస్త ఆలస్యంగా బోధపడింది.
ఇక కీర్తి చేసిన 'గుడ్ లక్ సఖి' పై ఇంతవరకూ ఎలాంటి బజ్ లేదు. మహేశ్ బాబు సరసన ఆమె చేస్తున్న 'సర్కారువారి పాట' ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం ఉంది. ఈ మధ్యలో కీర్తికి ఒక హిట్ పడవలసిన అవసరం ఉందని ఆమె సన్నిహితులు కూడా భావించారు. అనుకున్నట్టుగానే రీసెంట్ గా రిలీజైన 'రంగ్ దే' సక్సెస్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లనే రాబడుతోంది. టీజర్ .. ట్రైలర్ చూసినప్పుడు ఈ తరహా పాత్రకి రష్మిక అయితే బాగుంటుందని కొంతమంది అనుకున్నారు. కానీ థియేటర్ కి వెళ్లిన తరువాత కీర్తి అలాంటి ఆలోచన రానీయలేదు. టాప్ త్రీ రేసులో ఉన్న హీరోయిన్స్ లో కీర్తి కూడా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో ఆమె తన పొజీషన్ కాపాడుకుని, ఓ గండం నుంచి గట్టెక్కిందని చెప్పుకుంటున్నారు.