Begin typing your search above and press return to search.
'నాకు తెలీకుండానే మూడు నాలుగుసార్లు నా పెళ్లి చేసేశారు'
By: Tupaki Desk | 1 April 2021 8:45 AM GMTమలయాళ బ్యూటీ 'మహానటి' కీర్తి సురేష్ పెళ్లి వార్తలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అప్పట్లో కీర్తి ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యాపారవేత్తతో పెళ్ళికి సిద్ధమవుతోందని పుకార్లు షికారు చేశాయి. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కీర్తి క్లోజ్ గా ఉండటం చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి పీటలేక్కబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కెరీర్ పీక్ స్టేజీలో ఉన్న టైంలో కీర్తి అప్పుడే పెళ్లి చేసుకోవడమేంటని ఆమె అభిమానులు కూడా ఆందోళన చెందారు. అయితే పెళ్లి వార్తలపై అమ్మడు ఇంతవరకు ఎప్పుడూ స్పందించలేదు. తాజాగా కీర్తి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తెలియకుండానే ఇప్పటికే మూడు నాలుగు సార్లు పెళ్లిళ్లు చేశారని నవ్వుతూ చెప్పారు.
కీర్తి తాజాగా నితిన్ తో కలిసి నటించిన 'రంగ్ దే' సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న కీర్తి సురేశ్.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో తెలిపింది. అతనికి మానవత్వం మెండుగా ఉండాలని.. మనిషి మంచోడైతే చాలని పేర్కొంది. అయితే ప్రస్తుతానికి తను పెళ్లాడబోయే వ్యక్తి గురించి ఇప్పుడే ఏమీ ఆలోచించట్లేదని.. నిజంగా పెళ్లి పీటలెక్కడానికి ఇంకా చాలా టైమ్ ఉందని.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తనకు తెలియకుండానే మూడు నాలుగు సార్లు వేరే వేరే వాళ్ళతో పెళ్లిళ్లు చేశారని నవ్వుతూ చెప్పింది కీర్తి.
ఇదిలా ఉండగా కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'అన్నాతే' చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. అలానే మలయాళంలో మోహన్ లాల్ తో కలిసి నటించిన 'మరక్కార్ అరబికదలింటే సింహం' సినిమా మే నెలలో విడుదల కానుంది. డైరెక్టర్ సెల్వరాఘవన్ నటిస్తున్న 'సాని కాయిదం' అనే తమిళ్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది. తెలుగులో ఆమె నటించిన 'గుడ్ లక్ సఖీ' రిలీజ్ కి రెడీగా ఉంది. ఇదే క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి హీరోయిన్ గా నటిస్తోంది.