Begin typing your search above and press return to search.
మొహమాటానికి పోతే ఎలా అమ్మడూ!
By: Tupaki Desk | 4 Jan 2022 7:30 AM GMTఇటు టాలీవుడ్ లోను .. అటు కోలీవుడ్ లోను కీర్తి సురేశ్ కి మంచి క్రేజ్ ఉంది. ముద్దుగా .. బొద్దుగా కనిపించే కీర్తి సురేశ్ కి అభిమానుల సంఖ్య ఎక్కువే. అందమైన ఆమె నవ్వుకు ఆరాధకులు చాలామందినే ఉన్నారు. కీర్తిని మొదటిసారిగా చూసినవారు ఆమె ఆడిపాడే పాత్రలకి మాత్రమే పనికొస్తుందని అనుకున్నారు. కానీ ఆమెలో మంచి నటి ఉందనే విషయాన్ని 'మహానటి' సినిమా నిరూపించింది. ఆ సినిమా తరువాత కీర్తి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఆ తరువాత నాయిక ప్రధానమైన కథలను ఎంచుకోవడం ఆమె చేసిన పొరపాటుగా కనిపిస్తుంది.
అంతేకాకుండా తెలుగులో 'మహానటి' కారణంగా ఒక రేంజ్ లో క్రేజ్ వచ్చిన సమయంలో ఆమె ఇక్కడ గ్యాప్ ఇచ్చేసి, తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్లడం కూడా మరో మైనస్ అయింది. సావిత్రి బాగా బరువు పెరగడంతో అవకాశాలు తగ్గాయని ఆమె బయోపిక్ ద్వారా అర్థం చేసుకుందేమో వెంటనే సన్నబడిపోయింది. కీర్తిని పొద్దు తిరుగుడు పువ్వులా చూడాలనుకున్న ప్రేక్షకులు సన్నజాజి మొగ్గలా చూడటానికి ఇష్టపడలేదు. 'బొండు మల్లెలా బొద్దుగా ఉంటేనే నువ్వు బాగుంటావు అమ్మడూ' అంటూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అలా గ్లామర్ పరంగా కూడా మైనస్ మార్కులు తెచ్చుకున్న కీర్తి, మళ్లీ దారిలో పడటానికి చాలా కష్టమైంది. తెలుగులో రానున్న 'సర్కారువారి పాట' పైనే ఆమె ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో మునుపటి కీర్తి కనబడుతూ ఉండటంతో అభిమానులు కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇవి కాక తమిళంలో ఆమె చేస్తున్న మరికొన్ని సినిమాలు కూడా ఆమెకి మరింత పేరు తెచ్చేవిగానే కనిపిస్తున్నాయి. ఇటీవల ఉదయనిధి స్టాలిన్ సినిమాకి కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను గురించే అక్కడ అంతా మాట్లాడుకుంటున్నారు.
సాధారణంగా కీర్తి సురేశ్ హద్దులు దాటిన రొమాంటిక్ సీన్స్ లో చేయదు. ముందుగానే ఆమె ఈ విషయం చెప్పేస్తూ ఉంటుంది. అందువలన అక్కడక్కడా అవసరానికి తగినట్టుగా కొన్ని సీన్స్ చేసినా అవి పరిధులు దాటకుండానే ఉంటాయి. అలాంటిది ఉదయనిధి స్టాలిన్ సినిమాలో కాస్త రొమాంటిక్ పాళ్లు ఎక్కువగా ఉండే పాత్రనే అయినా ఓకే చెప్పేసిందని అంటున్నారు. ఆ పాత్రను చేయడం కీర్తికి ఇష్టం లేకపోయినా, ఉదయనిధి స్టాలిన్ కి గల నేపథ్యం కారణంగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి ఆ పాత్ర ఎలా ఉండనుందనేది ఆ సినిమా విడుదలయితే గాని తెలియదు.