Begin typing your search above and press return to search.

సర్కారు వారి పాటలో కీర్తి పాత్ర అలా ఉంటుందా..?

By:  Tupaki Desk   |   11 May 2022 10:31 AM GMT
సర్కారు వారి పాటలో కీర్తి పాత్ర అలా ఉంటుందా..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''సర్కారు వారి పాట''. రెండున్నరేళ్ల తర్వాత మహేశ్ నుంచి రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రేపు (గురువారం) ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.

'సర్కారు వారి పాట' అనేది యాక్షన్ - రొమాన్స్ తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అని ప్రమోషనల్ కంటెంట్ ని బట్టి అర్థం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇందులో మహేష్ బాబుతో పాటుగా హీరోయిన్ కీర్తి సురేష్ అందరినీ ఆకట్టుకుంది. తొలిసారిగా కలిసి నటించిన ఈ జోడీ.. స్క్రీన్ మీద ఫ్రెష్ ఫీలింగ్ ని తీసుకొచ్చింది. 'కళావతి' పాటలో ఎంతో అందంగా కనిపించిన కీర్తి.. 'మ మా మహేష్' సాంగ్ లో మాస్ స్టెప్పులు మరియు ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టింది.

'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ కళావతి అనే పాత్రలో కనిపించబోతోంది. అయితే యూఎస్ ప్రీమియర్స్ పడటానికి కొన్ని గంటల ముందు, ఆమె క్యారక్టర్ కు సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

SVP సినిమాలో కీర్తి ఒక ఆకతాయిగా కనిపించనుందని.. ఆమెకు గ్యాంబ్లింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇందులో తన పాత్ర ట్విస్ట్ ఇవ్వబోతోందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. చిత్ర బృందం మాత్రం కీర్తి రోల్ కు అధిక ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంటున్నారు.

మహేశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ ఇరగదీసిందని చెప్పారు. కళావతి పాత్ర చాలా సర్ప్రైజింగ్ గా వుంటుందని.. లవ్ ట్రాక్ మెయిన్ హైలెట్ అని తెలిపారు. ఫస్టాప్ లో తమ మధ్య 45 నిమిషాల ట్రాక్ ఉంటుందని.. ఆ సమయంలో థియేటర్ ఊగిపోతుందని మహేశ్ అన్నారు. తనతో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశానని.. ప్రేక్షకులు కూడా తమ మధ్య సీన్స్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారన్నారు.

దర్శకుడు పరశురాం సైతం కీర్తి సురేష్ పాత్ర కథలో చాలా కీలకమని.. ఆమెది చాలా బలమైన పాత్ర అని తెలిపారు. ఇందులో హీరోయిన్ గా కీర్తి తప్ప వేరే ఆప్షన్లు లేవని.. తనని ఎందుకు తీసుకున్నామో సినిమా చూశాక అందరికీ అర్థమవుతుందన్నారు. ఆమె లుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని.. ఆడియన్స్ మహేష్ బాబుతో సమానంగా కీర్తి గురించి కూడా మాట్లాడుకుంటారని పరశురాం పేర్కొన్నారు.

దీనిని బట్టి 'సర్కారు వారి పాట' సినిమాతో కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ అందుకోబోతోందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజానికి కీర్తి ఈ మధ్య పెద్దగా కమర్షియల్ చిత్రాలు చేయడం లేదు. చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్స్ గా మిగిలాయి. ఇటీవల ఆమె నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా ప్లాప్ అయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఇప్పుడు SVP తో సక్సెస్ అందుకొని లక్కీ బ్యూటీ అనిపించుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.