Begin typing your search above and press return to search.
కీర్తి సురేష్ రూటు ఎటువైపో ?
By: Tupaki Desk | 25 Nov 2018 9:00 PM ISTసావిత్రి గారి జీవిత కథతో రూపొందిన మహానటితో కెరీర్ పరంగా ఎన్నో మెట్లు ఎక్కేసిన హీరోయిన్ కీర్తి సురేష్ దాని తర్వాత ఆ స్థాయి విజయాన్ని కానీ పేరుని తెచ్చుకోలేకపోయింది. తమిళ్ లో వరసగా క్రేజీ ఆఫర్లు కొట్టేసింది కానీ అవేవి తనకు ప్రత్యేకమైన ఇమేజ్ అయితే తీసుకురాలేకపోయాయి. విక్రమ్ తో చేసిన సామీ స్క్వేర్ డిజాస్టర్ కాగా విశాల్ తో జోడి కట్టిన పందెం కోడి 2 జస్ట్ యావరేజ్ అనిపించుకుంది. విజయ్ సర్కార్ వసూళ్ల పరంగా బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కీర్తి సురేష్ కు అందులో దక్కింది ఏ మాత్రం ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్ర. కేవలం డ్యూయెట్లకే పరిమితం కావాల్సి వచ్చింది.
సో హీరో పక్కన డాన్స్ చేయడం తప్ప ఈ మూడు సినిమాల్లో కీర్తి సురేష్ చేసింది ఏమి లేదు. చిన్న క్యామియోలో సీమరాజా అనే మూవీ చేస్తే అదీ దారుణంగా ఫెయిల్ అయ్యింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కొత్త సినిమా ఏది ఒప్పుకోలేదు. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళి నుంచి పిలుపు వచ్చిందనే గాసిప్ నేపథ్యంలోనే కీర్తి సైలెంట్ గా ఉండటం కొత్త అనుమానాలకు తావిస్తోంది. పైగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నాని హీరోగా రూపొందబోయే సినిమాలో కీర్తినే అడిగితే చేయలేను అని చెప్పిందట.
నేను లోకల్ లాంటి హిట్ కాంబినేషన్ హీరో అయినా ఎందుకు వద్దందా అనే టాక్ నడుస్తోంది. తమిళ్ కంటే తెలుగులోనే పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్రలు దక్కుతున్నాయని కీర్తి అందుకే ఇటు వైపు చూస్తున్నట్టు టాక్. పైగా తన సినిమా ప్రమోషన్ ఏదీ లేకపోయినా విరివిగా కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది కీర్తి. రానా నెంబర్ వన్ యారిలో ఇటీవలే నానితో కలిసి అల్లరి చేసింది. మొత్తానికి కీర్తి సురేష్ పయనం బిర్యానీ వైపా సాంబారు వైపా ఇంకా తేలాల్సి ఉంది