Begin typing your search above and press return to search.
అల్లు అర్జున్ కు కేరళలో నో ఎంట్రీ.. అయినా భయం లేదు
By: Tupaki Desk | 14 March 2020 4:06 AM GMTసుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ చేయాల్సిన సినిమాను ఏదో ఒక ఇబ్బంది వెంటాడుతూనే ఉంది. ఈ సినిమా ఏడాది కిందట్నుంచి చర్చల్లో ఉంది. ఇదిగో అదిగో అంటున్నారే కానీ.. ఎంతకూ షూటింగ్ మొదలు కావట్లేదు. అల వైకుంఠపురములో చిత్రాన్ని బన్నీ నాలుగు నెలల కిందటే పూర్తి చేశాడు. అప్పట్నుంచి బన్నీ ఖాళీగానే ఉన్నప్పటికీ చిత్రీకరణ లో పాల్గొనట్లేదు. కొన్ని రోజులు లుక్ మార్చుకోవడానికి సమయం తీసుకున్నాడు. అతను రెడీ అయ్యాక కూడా ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. అన్ని అడ్డంకులూ తొలగించుకుని కేరళలో ఈ వారంలోనే షూటింగ్ మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ దెబ్బకు కేరళ బెంబేలెత్తుతుండటంతో ఇప్పుడిప్పుడే అక్కడికి వెళ్లే పరిస్థితి లేక పోయింది. అక్కడి అడవుల్లో చిత్రీకరణకు కేరళ ప్రభుత్వం నో అన్నట్లు సమాచారం.
వేసవి దాటితో కేరళ లో అటవీ ప్రాంతాల్లో జోరు వర్షాలు మొదలవుతాయి. మళ్లీ ఎప్పుడు షూటింగ్కు అనువైన వాతావరణం ఉంటుందో తెలియదు. సినిమా చాలా ఆలస్యం అయి పోతుంది. అందుకే సుకుమార్ ప్లాన్-బితో రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆంధ్రాలోనే ఓ అటవీ ప్రాంతం లో ఆయన షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి మడ అడవుల్లో ఇంకో వారం రోజుల్లో షెడ్యూల్ కాబోతోందట.
ఇంతకుముందు ఇక్కడ కేశవ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆ సినిమా రషెస్ చూసి మన దగ్గర ఇలాంటి అటవీ ప్రాంతం ఉందా అని ఆశ్చర్యం కలిగినట్లు సుక్కు ఓ కార్యక్రమం లో చెప్పడం గమనార్హం. అప్పుడు ఆయన ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఇటీవల తన టీంతో కలిసి అక్కడికి వెళ్లొచ్చిన ఆయన.. కేరళ లో చిత్రీకరణ లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే కొన్ని సీన్లు ఇక్కడ తీయాలనుకున్నారట. ఇప్పుడు కేరళ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అయి పోవడంతో ఇక్కడే సాధ్యమైనన్ని సీన్లు లాగించేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.