Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: కేశవ రక్త చరిత్ర రాస్తున్నాడా
By: Tupaki Desk | 24 Dec 2016 9:24 AM GMTయంగ్ హీరో నిఖిల్- దర్శకుడు సుధీర్ వర్మ.. టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో ఒకటి. స్వామి రారా అంటూ చిన్న మూవీతో పెద్ద సెన్సేషన్ సృష్టించిన ఈ కాంబినేషన్.. ఇప్పుడు కేశవ అంటూ మరో ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రెండు రోజుల క్రితం ప్రీలుక్ తో ఆకట్టుకున్న కేశవ.. ఇప్పుడు ఫస్ట్ లుక్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు.
కేశవ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నిఖిల్ ఒక్కడే కనిపిస్తాడు. అయితే.. ఏ రేంజ్ రఫ్ గా ఉన్నాడంటే.. ఇప్పటి మాస్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో ఉన్నాడు నిఖిల్. రఫ్ గా పెంచిన గెడ్డం.. కొంచెం లెంగ్తీగా మీస.. డ్యుయల్ షేడ్స్ లో హెయిర్.. అన్నిటికీ మించి ఫేస్ లో కనిపిస్తున్న కసి. పోస్టర్ మాత్రం రక్తపాతం నింపేసి.. రక్త చరిత్రను గుర్తు చేశారు. నిఖిల్ కి పాయింట్ బ్లాంక్ లో డిజైన్ చేసిన గన్.. ఫ్లోర్ పై రక్తం మరకలు.. పక్కనే తుపాకీ.. ఇవన్నీ కేశవతో నిఖిల్ తనలో మాస్ హీరోను బయటకు తీసినట్లుగా అనిపించడం ఖాయం.
అయితే సబ్జెక్ట్ విషయంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని ఎంచుకుని ఈ కుర్ర హీరో.. కేవలం మాస్ మూవీ తీసే ఛాన్స్ లు చాలా తక్కువ. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న కేశవ మూవీ ఫస్ట్ లూక్ చూశాక వచ్చిన కిక్ కి.. 'పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే కిక్కే వేరు' అనే ట్యాగ్ లైన్ సరిగ్గా సూట్ అయిందని అనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/