Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'కేశవ'
By: Tupaki Desk | 19 May 2017 10:07 AM GMTచిత్రం : ‘కేశవ’
నటీనటులు: నిఖిల్ - రీతూ వర్మ - ఇషా కొప్పికర్ - రావు రమేష్ - అజయ్ - బ్రహ్మాజీ - ప్రియదర్శి - వెన్నెల కిశోర్ - సుదర్శన్ - మధునందన్ - రాజా రవీంద్ర - రవిప్రకాష్ - సమీర్ తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్
నేపథ్య సంగీతం: ప్రశాంత్ పిళ్లై
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: అభిషేక్ నామా
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సుధీర్ వర్మ
ఒడుదొడుకులతో సాగిన యువ కథానాయకుడు కెరీర్ ను నిలబెట్టిన సినిమా ‘స్వామి రారా’. అప్పట్నుంచి వైవిధ్యమైన సినిమాలతో.. మంచి విజయాలతో సాగిపోతున్నాడు నిఖిల్. తన కెరీర్ ను మలుపు తిప్పిన ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మతో మళ్లీ ‘కేశవ’ కోసం జత కట్టాడు నిఖిల్. ప్రోమోలతో ఆసక్తి రేకెత్తించిన ‘కేశవ’ మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఆ అంచనాల్ని అందుకుందో లేదో చూద్దాం పదండి.
కథ:
కేశవ (నిఖిల్) లా కాలేజీ విద్యార్థి. అతికి గుండె కుడివైపున ఉంటుంది. ఆవేశ పడ్డా.. ఉద్వేగానికి గురైనా అతడి ప్రాణానికే ప్రమాదం. అలాంటి వాడు.. కొందరు పోలీసుల్ని లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తూ వెళ్తాడు. ఏ క్లూ వదలకుండా రెండు హత్యలు చేసిన అతను.. మూడో హత్య చేశాక పోలీసులకు దొరికిపోతాడు. ఇంతకీ అతనీ హత్యలు ఎందుకు చేశాడు.. అతడి గతమేంటి.. పోలీసుల నుంచి అతను ఎలా బయటపడ్డాడు. మిగతా వాళ్లపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
కథ ఎలా పాతదే అయినా.. సాదాసీదాగా అనిపించినా.. ఆ కథను చెప్పే తీరులో కొత్తదనం చూపించడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలుస్తుంటారు కొందరు దర్శకులు. సుధీర్ వర్మ ‘కేశవ’తో చేసింది కూడా అలాంటి ప్రయత్నమే. కథగా చూసుకుంటే ‘కేశవ’ ఏమంత ఎగ్జైట్మెంట్ ఇవ్వదు. చాలా మామూలుగా అనిపిస్తుంది. ఎన్నోసార్లు చూసిన రివెంజ్ డ్రామానే ఇది. తన కుటుంబాన్ని చంపినవాళ్ల మీద పగ తీర్చుకునే కుర్రాడి కథ ‘కేశవ’. ఇందులో పెద్ద మలుపులు కూడా ఏమీ లేవు. ఐతే ఈ సాదాసీదా కథకు సుధీర్ వర్మ స్టైలిష్ టేకింగ్.. బలమైన సాంకేతిక సహకారం.. నిఖిల్ సిన్సియర్ యాక్టింగ్ తోడవడంతో ‘కేశవ’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది.
మామూలు సన్నివేశాల్ని కూడా టేకింగ్ తో ఎలా ఆసక్తకరంగా తీర్చిదిద్దవచ్చో చెప్పడానికి ‘కేశవ’లో చక్కటి ఉదాహరణలు కనిపిస్తాయి. హీరో హత్యలు చేసే సన్నివేశాల్ని మలిచిన తీరు సుధీర్ వర్మ.. అతడి టీం ప్రతిభకు అద్దం పడుతుంది. ఆ సన్నివేశాల్లో కెమెరా పనితనం వావ్ అనిపిస్తే.. నేపథ్య సంగీతం ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ‘కేశవ’లో కథ.. హీరో పాత్ర పూర్తి సీరియస్ గా సాగినప్పటికీ.. ఇందులో వినోదానికి ఢోకా లేకపోవడం కూడా కథనం పెద్దగా బోర్ కొట్టించకుండా సాగిపోంది. ఓవైపు హీరోతో ముడిపడ్డ సన్నివేశాలు ఎంత సీరియస్ గా... ఇంటెన్స్ గా ఉంటాయో.. మరోవైపు కాలేజీ బ్యాక్ డ్రాప్ వచ్చే సన్నివేశాలు అంత సరదాగా సాగిపోతాయి. హడావుడి లేకుండా సటిల్ గా సాగే వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుంది. ఇలాంటి సినిమాలో కామెడీ ఏంటి అనిపించకుండా.. కథకు అడ్డం పడకుండా సాగుతుంది ఈ ట్రాక్. గంట నిడివి ఉన్న ప్రథమార్ధంలో బోర్ కొట్టించే మూమెంట్స్ పెద్దగా ఏమీ లేవు.
ఐతే విరామం వరకు ‘కేశవ’ను గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్ వర్మ.. ద్వితీయార్ధంలో ఆ బిగిని కొనసాగించలేకపోయాడు. హీరో పోలీసుల నుంచి బయటపడే సన్నివేశాలు అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఇక్కడ సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగా వాడేసుకున్నాడు సుధీర్. పోలీసులకు హత్యలు చేసిందెవరో పక్కాగా తెలిసినా.. మీడియాలో రగడ అవుతోందని నిందితుడిని వదిలేయడం.. అతను ఆ తర్వాత కూడా తనపాటికి తాను హత్యలు చేసుకుంటూ వెళ్లడం.. విలన్ల వైపు నుంచి హీరోకు కౌంటర్ అటాక్ లేకపోవడం అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఐతే మామూలుగా ముగిసేలా కనిపించే ‘కేశవ’.. చివర్లో మళ్లీ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. క్లైమాక్స్ ట్విస్టు.. హీరో తన పగకు తెరదించే పతాక సన్నివేశం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇక్కడ దర్శకుడిగా మళ్లీ సుధీర్ డ్రైవర్ సీట్ తీసుకుంటాడు. తనదైన ముద్ర వేస్తాడు.
హీరోకు కుడివైపు గుండె ఉండటం.. అతను ఆవేశపడితే.. ఉద్వేగానికి గురైతే ప్రాణాలకే ముప్పు ఏర్పడటం అనే అంశం చుట్టూ నెలకొన్న హైప్ కు తగ్గట్లుగా ‘కేశవ’లో సన్నివేశాలేమీ లేవు. నిఖిల్ తన నటన ద్వారా ఈ విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేశాడు కానీ.. దీని చుట్టూ సుధీర్ ఎలాంటి ఆసక్తికర సన్నివేశాలేమీ తీర్చిదిద్దుకోలేకపోయాడు. ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన ఈ అంశాన్ని సుధీర్ సరిగ్గా వాడుకుని ఉంటే ‘కేశవ’ మరింత గ్రిప్పింగ్ గా తయారయ్యేదే. కాలేజీలో చదువుకునే హీరోకు అసలు డబ్బులెక్కడి నుంచి వస్తుంటాయి.. తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణమైన వాళ్ల గురించి చిన్న పిల్లాడైన హీరోకు ఎలా తెలిసింది.. రావు రమేష్ నిజ స్వరూపం గురించి హీరో ఎలా పసిగట్టాడు.. లాంటి ప్రశ్నలకు సినిమాలో సమాధానం లేదు. ఐతే స్క్రిప్టు కొంచెం వీకే అయినప్పటికీ.. సుధీర్ తన టేకింగ్ తో మాయ చేయడంతో ‘కేశవ’ చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. నిడివి రెండు గంటల్లోపే ఉండటం.. డీవియేషన్ లేకుండా సూటిగా కథను చెప్పడం.. సాంకేతిక హంగులు బాగా కుదరడం.. నిఖిల్ పెర్ఫామెన్స్ ‘కేశవ’ ప్లస్సయ్యాయి. మైనస్సులూ ఉన్నప్పటికీ ‘కేశవ’ను ఒక్కసారి చూసేందుకు ఢోకా లేదు.
నటీనటులు:
నిఖిల్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్సెస్ లో ఇదొకటని నిస్సందేహంగా చెప్పొచ్చు. మామూలుగా హైపర్ యాక్టివ్ గా కనిపించే నిఖిల్.. ఇలాంటి కామ్ క్యారెక్టర్ చేసి మెప్పించడం చిన్న విషయమేమీ కాదు. రకరకాల హావభావాలు ఇవ్వడం కంటే కూడా ఏ భావమూ పలకని పాత్రలో నటించడం కష్టం. పాత్ర స్వభావాన్ని అర్థం చసుకుని.. అందుకు తగ్గట్లుగా పరిణతితో నటించాడు నిఖిల్. అతను సినిమా అంతటా ఒకే రకమైన ఇంటెన్సిటీని కొనసాగించాడు. నిఖిల్ లుక్ కూడా పాత్రకు తగ్గట్లుగా బాగా కుదిరింది. హీరోయిన్ రీతూ వర్మ పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా.. ఉన్నంతలో బాగానే చేసింది. చాన్నాళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన ఇషా కొప్పికర్ ఓకే అనిపిస్తుంది. రావు రమేష్ కనిపించింది తక్కువ సన్నివేశాల్లోనే. ఐతే పతాక సన్నివేశంలో ఆయన తన ప్రత్యేకత చూపించారు. వెన్నెల కిషోర్ తనదైన కామెడీ టైమింగ్ తో.. హావభావాలతో గిలిగింతలు పెట్టేశాడు. ప్రియదర్శి.. సుదర్శన్ కూడా బాగా చేశారు. అజయ్.. రవిప్రకాష్.. బ్రహ్మాజీ.. రాజా రవీంద్ర.. జీవా.. వీళ్లంతా ఓకే.
సాంకేతికవర్గం:
‘కేశవ’కు టెక్నీషియన్స్ పెద్ద బలంగా నిలిచారు. సన్నీ ఎం.ఆర్. పాటలు పర్వాలేదు. సినిమాలో పాటలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. ఐతే ప్రశాంత్ పిళ్లై నేపథ్య సంగీతం మాత్రం సినిమాకు పెద్ద ప్లస్ అయింది. బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా.. ఇంటెన్స్ గా అనిపిస్తుంది. ఎప్పుడూ వినని కొత్త సౌండ్లతో భిన్నమైన అనుభూతిని కలిగించాడు ప్రశాంత్. బ్యాగ్రౌండ్ స్కోర్ కీలకమైన సన్నివేశాల్ని బాగా ఎలివేట్ చేసింది. దివాకర్ మణి ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కెమెరా యాంగిల్స్.. ఏరియల్ షాట్స్.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. సినిమా అంతా విజువల్స్ బాగున్నాయి. కెమెరా పనితనం కారణంగా ‘కేశవ’ లుక్కే వేరుగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. అభిషేక్ ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చిన సంగతి తెరమీద కనిపిస్తుంది. మాటలు కూడా బాగా కుదిరాయి. ‘దోచేయ్’తో నిరాశ పరిచిన సుధీర్ వర్మ.. తిరిగి ఫామ్ అందుకున్నాడు. దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు. చాలా సన్నివేశాల్లో దర్శకుడి పనితనం కనిపిస్తుంది. ఐతే రచయితగా మాత్రం సుధీర్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. స్క్రిప్టు మరింత పకడ్బందీగా తీర్చిదద్దుకునే ఉంటే.. ‘కేశవ’ స్థాయి వేరుగా ఉండేది.
చివరగా: కేశవ.. ఎంగేజింగ్ థ్రిల్లర్
రేటింగ్- 2.75/5
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre