Begin typing your search above and press return to search.
ఎంత క్రేజ్ అయితే మాత్రం మరీ ఇంత దోపిడీనా?
By: Tupaki Desk | 28 April 2017 8:04 AM GMTతెలుగోడి ప్రతి ఒక్కరూ తన సినిమాగా ఫీలవుతూ.. బాహుబలిని సినిమా స్థాయిని ఎక్కడి వరకూ తీసుకెళ్లారో తెలిసిందే. రాజమౌళి కష్టాన్ని తమ కష్టంగా పీలయ్యారే కానీ.. భారంగా అనుకోలేదు. ఒక తెలుగోడు చేసి ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆహ్వానించిన తెలుగు ప్రేక్షకుడు.. ఈ రోజు అదే సినిమా కారణంగా దోపిడీకి గురి కావటం విషాదంగా చెప్పాలి.
తాను పెంచిన బిడ్డే.. తనకు దెబ్బేస్తే ఎలా ఉంటుందో.. ఇప్పుడు బాహుబలి మీద అభిమానం పెంచుకున్న వారంతా ఇలానే ఫీలవుతున్నారు. బాహుబలి 2 మీదున్న క్రేజ్‌ను సొమ్ము చేసుకోవటానికి.. అడ్డదిడ్డంగా అనే కంటే ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. థియేటర్ల దగ్గర టికెట్ల పేరుతో సాగుతున్న దోపిడీకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఉందని పలువురు వాదిస్తున్నారు.
తక్షణమే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సినిమా థియేటర్ల వద్ద రెవెన్యూ.. వాణిజ్య పన్నుల శాఖాధికారుల్ని నియమించి టికెట్ల మాఫియాపై చర్య లు తీసుకోవాలని పలువురు ప్రేక్షకులు డిమాండ్ చేశారు. అందరూ సినిమాను చూసే అవకాశం కల్పించటంతో పాటు.. చట్టబద్ధంగా ఎంత అయితే టికెట్లకు వసూలు చేయాలో అంత మొత్తాన్నే తీసుకోవాలే తప్పించి.. క్రేజ్ పేరిట దారి దోపిడీకి పాల్పడుతున్నట్లుగా వ్యవహరించకూడదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
నాలుగేళ్లకు పైనే రాజమౌళి అండ్ కో తెరకెక్కించిన బాహుబలి చిత్రం.. భారతీయ చలనచిత్ర రంగానికి కీలకమైన రోజుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ.. బ్లాక్ టికెట్ల మాఫియా కారణంగా ఈ సినిమాను చూడాలనే ప్రేక్షకుడి ఆశకు గండి కొట్టేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు.. సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నారు.
ప్రేక్షకులు దోపిడీకి గురి కాకుండా చర్యలు తీసుకునేలా ముఖ్యమంత్రులు ప్రయత్నించాలని ఆయన కోరుతున్నారు. అసలు ప్రేక్షకులు సినిమా టికెట్‌ను ప్రభుత్వం నిర్ణయించిన దాని కంటే ఎక్కువకు కొనుగోలు చేసి మరీ సినిమాను ఎందుకు చూడాలి? అని ప్రశ్నిస్తున్నారు. కొన్నిచోట్ల థియేటర్ యజమాన్యాలతో గొడవ పడి పోలీస్ స్టేషన్ల వద్దకు పంచాయితీలు జరుగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. బాహుబలి టికెట్లను ఎక్కువ ధరకు అమ్మటం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభం ఏమీ ఉండదని.. దీనివల్ల ప్రేక్షకుడే నష్టపోతాడన్నాడు. ప్రభుత్వం నిర్ణయించిన పన్ను మాత్రమే ప్రభుత్వానికి వెళుతుందే తప్పించి.. టికెట్ల పెంపు కారణంగా ప్రభుత్వానికి ఎలాంటి లాభం ఉండదని చెప్పిన ఆయన.. ప్రేక్షకులు దోపిడీకి గురి కాకుండా చూడాలన్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/