Begin typing your search above and press return to search.
*లక్ష్మీస్* ఎఫెక్ట్!... కేతిరెడ్డికి బెదిరింపులు !
By: Tupaki Desk | 15 Nov 2017 12:17 PM GMTతెలుగు ప్రజల ఆరాధ్య నటుడు - తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు - ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న చిత్రాలు ఇప్పటికే తెలుగు నేలలోనే కాకుండా దేశవ్యాప్తంగానూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ప్రకటించిన చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా, *లక్ష్మీస్ ఎన్టీఆర్* పేరిట తెరకెక్కుతున్న చిత్రానికి బాలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించిన తర్వాతే ఆయన అప్రతిష్ఠ మూటగట్టుకున్నారన్న కోణంలో తెరకెక్కుతున్న చిత్రం *లక్ష్మీస్ వీరగ్రంథం*. ఈ చిత్రానికి తమిళనాట తెలుగు భాష, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సదరు చిత్రానికి ఓ నిర్మాత ఉన్నారని చెబుతున్నా... కేతిరెడ్డే ఆ నిర్మాత అన్న అనుమానాలు కూడా లేకపోలేదు.
ఇదంతా బాగానే ఉన్నా... తొలి రెండు చిత్రాలు ఇప్పటిదాకా ఇంకా సెట్స్ కి ఎక్కలేదనే చెప్పాలి. అయితే ఆ చిత్రాల కంటే ముందుగానే తన చిత్రాన్ని విడుదల చేయాలన్న కోణంలో కేతిరెడ్డి తన చిత్ర షూటింగ్‌ను ప్రారంభించేశారు. అయితే అనుకోని రీతిలో హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద, ఆ తర్వాత కృష్ణా జిల్లాలోని ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులోనూ కేతిరెడ్డికి ఎదురు దెబ్బలు తగిలాయి. దీంతో తన చిత్ర షూటింగ్‌ను వాయిదా వేసుకోక తప్పని కేతిరెడ్డి... నిన్న ఓ సంచలన ఆరోపణ చేశారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రాన్ని తీస్తే... ఇబ్బందులకు గురి కాక తప్పదని, తక్షణమే చిత్ర షూటింగ్‌ను నిలిపివేయాలని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆయనకు బెదిరింపుల కాల్స్ వచ్చాయట. ఈ విషయాన్ని వెనువెంటనే బయటపెట్టే ఉద్దేశ్యంతో ఓ వీడియోను విడుదల చేసిన కేతిరెడ్డి... తనతో పాటు చిత్ర నిర్మాతకు భద్రత కల్పించాలని ఏపీ పోలీసులను కోరారు. అయినా ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న మిగిలిన రెండు చిత్రాలకు సంబంధించి వ్యక్తులకు ఎలాంటి బెదిరింపులు ఎదురు కావడం లేదని, తనకు మాత్రమే ఈ బెదిరింపులు ఎందుకు వస్తున్నాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే... లక్ష్మీపార్వతి స్వయంగా తనను ఇబ్బందులకు గురి చేసేందుకు యత్నిస్తున్నట్లుగా అర్థమవుతోందని కేతిరెడ్డి ఆరోపించారు. మిగిలిన రెండు చిత్రాల వారిని వదిలేసిన లక్ష్మీపార్వతి తననున ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేశారని కూడా ఆయన ఆ వీడియోలో ప్రశ్నించారు. బెదిరింపుల నేపథ్యంలో తనకు, తన చిత్ర నిర్మాతకు ప్రాణ హాని ఉందని, తమ ఇద్దరికీ రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లక్ష్మీ పార్వతి అప్పట్లో రాజ్యాంగేతర శక్తిగా మారి ఎన్టీఆర్ జీవితాన్ని ప్రభావితం చేసిందని, ఇప్పుడు కూడా తన పలుకుబడిని ఉపయోగించి సినిమాను అడ్డుకుంటోందని ఆరోపించారు. తనను చంపుతామంటూ కొన్నిరోజులుగా బెదిరింపులు వస్తున్నాయని ఆ వీడియోలో వెల్లడించారు. తనకు, తన సినిమా నిర్మాతకు పోలీస్ సెక్యూరిటీ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమకు రక్షణ కల్పించాల్సిందిగా డీజీపీని కలిసి విన్నవించుకుంటానని కూడా చెప్పారు. అవసరమైతే కోర్టుకు వెళ్లి సెక్యూరిటీ కల్పించమని కోరతానని వీడియోలో స్పష్టం చేశారు. మరి ఈ వీడియోపై లక్ష్మీపార్వతి ఎలా స్పందిస్తారో చూడాలి.