Begin typing your search above and press return to search.

ఉయ్యాలవాడపై చిరుకు విన్నపమేనా!!

By:  Tupaki Desk   |   13 May 2017 4:36 AM GMT
ఉయ్యాలవాడపై చిరుకు విన్నపమేనా!!
X
నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి.. సినిమాల్లో కంటే రాజకీయాల్లో మహా యాక్టివ్ గా ఉంటారు. తమిళనాడులో తెలుగువారు అణచివేతకు గురవుతున్నారంటూ.. తమిళ-తెలుగు యువశక్తి అంటూ ఓ ఉద్యమాన్నే నడిపిస్తున్నారు. తాజాగా ఈయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ వీరుడిగా గుర్తించాలనే డిమాండ్ ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఉయ్యాలవాడపై సినిమా చేస్తున్న చిరంజీవికి కూడా పలు విజ్ఞప్తులు చేశారు.

'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం భావి భారత పౌరులకు స్ఫూర్తిదాయకం అయింది. ఆయన పోరాటం ప్రారంభించి.. మరణించిన 100 ఏళ్లకు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తాను చనిపోయిన వందేళ్లకైనా స్వాతంత్ర్యం రావాలని కోరుకున్నారు. అలాంటి వీరుని చరిత్రను మీరు తెరకెక్కిస్తున్నారు. సన్నివేశాలన్నీ ధీరత్వానికి సంబంధించి ఉండాలి. మహానటుడు అయినటువంటి చిరంజీవి గారు.. కమర్షియల్ వాల్యూస్ కోసం కాకుండా.. అల్లూరి సీతారామరాజు మాదిరిగా తీయాలి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గొప్పదనం చాటేదిగా ఉండాలి' అన్నారు కేతిరెడ్డి.

పొలిటికల్ వేదికలపై మాట్లాడుతూ ప్రతీ అంశాన్ని విన్నపంలాగే చెప్పడం అలవాటయిన కేతిరెడ్డి.. ఉయ్యాలవాడ విషయంలో చిరంజీవిని కోరినవన్నీ వినతుల్లాగే కనిపిస్తున్నా.. వాటి స్థాయి మాత్రం డిమాండ్స్ టైపులో ఉందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/