Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: ఫిదా చేస్తున్న రొమాంటిక్ బ్యూటీ

By:  Tupaki Desk   |   6 April 2020 7:50 AM GMT
ఫోటో స్టోరీ: ఫిదా చేస్తున్న రొమాంటిక్ బ్యూటీ
X
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' లో హీరోయిన్ కేతిక శర్మ తెలుసు కదా? అయినా 'రొమాంటిక్' పోస్టర్లు.. ఇతర ప్రోమోస్ చూసినవారు చచ్చినా కేతికను మర్చిపోరు.. మర్చిపోజాలరు. అలాంటి హాట్నెస్ ఈ కేతికకు సొంతం. ఈతరంలో ఉన్న మిగతా హీరోయిన్ల తరహాలోనే ఈ భామ కూడా సోషల్ మీడియాను షేక్ చెయ్యడంలో ఎప్పుడో పీహెచ్డీ పట్టా పుచ్చుకుంది.

కేతిక తన ఇన్స్టాలో పోస్ట్ చేసే ఫోటోలకు స్పందన భారీగా ఉంటుంది. ఇప్పుడు అందరూ లాక్ డౌన్ పుణ్యమా అని ఎవరి ఇంట్లో వారు కూర్చున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవారిని పక్కన పెడితే మిగతా వారు కుదిరితే టీవీ చూస్తారు.. లేకపోతే సోషల్ మీడియా బ్రౌజ్ చేస్తారు. ఇలా జనాలకు ఎక్కువ సమయం దొరకడంతో హాటు భామల పాత ఘాటు ఫోటోలకు డిమాండ్ పెరిగిందని సమాచారం. ఈ భామలు తాజాగా పోస్ట్ చేసే ఫోటోలే కాకుండా ఎప్పుడో పోస్ట్ చేసిన ఫోటోలను కూడా వెతికి మరీ లైకులు కొట్టడం.. కామెంట్లు పెట్టడడం లాంటివి చేస్తూ లాక్ డౌన్ కాలాన్ని చిలిపిగా గడుపుతున్నారు. పైనున్న ఫోటోను కేతిక ఈ ఫిబ్రవరిలో పోస్ట్ చేసింది. అయితేనేం.. ఇప్పుడు డిమాండ్ పెరిగింది.. లైకులు కామెంట్లు కొత్తగా వస్తున్నాయి.. ఫోటో కూడా వైరల్ అవుతోంది.

ఈ ఫోటోలో కేతిక బ్రౌన్ కలర్ టాప్ ధరించి అందాల విందు చేస్తూనే.. ఓ సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. హెయిర్ స్టైల్ కూడా అదిరిపోయింది. హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రెస్ లాగా కనిపిస్తోంది. 'రొమాంటిక్' సినిమా ఇంకా రిలీజ్ కాలేదు కానీ ఆ సినిమా రిలీజ్ అయితే ఈ భామ క్రేజ్ డబల్.. ట్రిపుల్ కావడం ఖాయం. అందులో ఏమాత్రం సందేహం లేదు.