Begin typing your search above and press return to search.

ముగ్గురు మ‌గ న‌టుల్ని వేధించిన బీస్ట్ కి బెయిల్?

By:  Tupaki Desk   |   18 Jun 2022 6:32 AM GMT
ముగ్గురు మ‌గ న‌టుల్ని వేధించిన బీస్ట్ కి బెయిల్?
X
2018లో #మీటూ వేదిక‌గా ఆరోప‌ణ‌ల ఫ‌ర్వం గురించి తెలిసిందే. ఇది భార‌త‌దేశం స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా సంచ‌ల‌నమైంది. అప్ప‌ట్లోనే హాలీవుడ్ లో వేధింపుల మాన్ స్ట‌ర్ కెవీన్ స్పేసీని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. కోర్టుల ప‌రిధిలో విచార‌ణ ఏళ్లుగా కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌ముఖ న‌టుడు కం నిర్మాత అయిన కెవిన్ సెట్స్ లోనే ప‌లువురు అగ్ర క‌థానాయిక‌ల‌ను వేధించాడని.. అంతేకాకుండా ప‌లువురు మేల్ స్టార్ల‌ను కూడా లైంగికంగా వేధించాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అత‌డి త‌ర‌పున న్యాయ‌వాదులు కోర్టులో వాదిస్తున్నా కానీ బెయిల్ రాలేదు. ఎట్ట‌కేల‌కు హౌస్ ఆఫ్ కార్డ్స్ నటుడు కెవిన్ స్పేసీకి లండన్ కోర్టు బేషరతు బెయిల్ మంజూరు చేసింది.

గురువారం ఉదయం లండన్ లోని వెస్ట్ మిన్ స్టర్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరైన కెవిన్ స్పేసీపై నాలుగు లైంగిక వేధింపులతో సహా ఐదు నేరాలకు పాల్పడినందున విచార‌ణ సాగుతోంద‌ని.. అతనికి షరతులు లేని బెయిల్ లభించిందని అధికారులు వెల్ల‌డించారు. ది హాలీవుడ్ రిపోర్టర్ క‌థ‌నం ప్రకారం.. కోర్టులో సుమారు 45 నిమిషాల విచారణ తర్వాత డిప్యూటీ చీఫ్ మేజిస్ట్రేట్ టాన్ ఇక్రమ్ ఈ కేసును సౌత్ వార్క్ క్రౌన్ కోర్టుకు పంపడం ద్వారా ముగించారు.

జూలై 14న దీనిపై త‌దుప‌రి విచారణ సాగనుంది. కోర్టు నిర్ణయం తీసుకోని పక్షంలో అతను స్పేసీకి షరతులు లేని బెయిల్ మంజూరు చేసిన‌ట్టేన‌ని వెల్ల‌డైంది. "అత‌డితో నిజమైన ప్రమాదం ఉందని నేను అనుకోవ‌డం లేదు" అని న్యాయమూర్తి వ్యాఖ్యానించిన‌ట్టు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది.

కోర్ట్ రూమ్ లో ముఖ్యుల్లో లీగల్ డిఫెన్స్ లీడ్ పాట్రిక్ గిబ్స్ క్యూసి - ప్రాసిక్యూటర్ నటాలీ డాసన్ ఉన్నారు. U.S. స్పేసీ డిఫెన్స్ నుండి ఒకరితో సహా ముగ్గురు న్యాయవాదుల బృందంతో స్పేసీ ప్రవేశించాడు. అతను త‌నపై వ‌చ్చిన‌ అన్ని ఆరోపణలను తీవ్రంగా ఖండించాడు. అయితే అతను తన జీవితాన్ని కొనసాగించాలనుకుంటే ఈ ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

హౌస్ ఆఫ్ కార్డ్స్ నటుడు స్పేసీపై ముగ్గురు మ‌గ‌ళ్ల‌పై నాలుగు లైంగిక వేధింపుల అభియోగాలు మోప‌గా.. ఒక వ్యక్తి సమ్మతి లేకుండా బ‌ల‌వంతంగా లైంగిక చర్యలో పాల్గొన్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ ఆరోపణల తర్వాత పాపుల‌ర్ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్ స్పేసీతో సంబంధాలను తెంచుకుంది. హౌస్ ఆఫ్ కార్డ్స్ చివరి సీజన్ నుండి అతనిని తొలగించింది. అతని చిత్రం 'గోర్‌'ను నిలిపివేసింది. రిడ్లీ స్కాట్ 'ఆల్ ది మనీ ఇన్ ది వరల్డ్‌'లో J. పాల్ గెట్టిగా అతని పాత్రను వేరొక న‌టుడితో రీషూట్ చేసారు. అతని స్థానంలో క్రిస్టోఫర్ ప్లమ్మర్ నటించాడు.

కోర్టు విచారణలో ఎక్కువ భాగం స్పేసీ బెయిల్ కోసమే పోరాడాడు. శిక్ష తీవ్రతను బట్టి అతను దోషిగా తేలితే U.K.కి తిరిగి వెళ్లే అవ‌కాశ‌మే లేద‌ని నివేదిక‌లు ఉన్నాయి. అయితే స్పేసీ U.K.లోనే ఉండి తన ప్రయాణ పత్రాలను సమర్పించాలని న్యాయ‌వాది డాస‌న్ చెప్పారు. స్పేసీ ఇప్పటివరకు అన్ని చట్టపరమైన అవసరాలకు సహకరించారని U.S.లో పోలీసులు ఇంటర్వ్యూ చేయడానికి చాలా గంటలు గడిపారని గత నెలలో అతను వాగ్దానం చేసినట్లుగా విచారణకు స్వచ్ఛందంగా హాజరయ్యారని మ‌రొక లాయ‌ర్ గిబ్స్ నొక్కిచెప్పినట్లు నివేదిక పేర్కొంది.

అతను U.S. స‌హా U.K వెలుపల ప్రయాణించగలగడం అనేది అతను చేసే పనిపై ఆధారపడి ఉంటుందని వాద‌న‌లు వినిపించారు. బెయిల్ మంజూరు చేయడంపై డిప్యూటీ చీఫ్ మేజిస్ట్రేట్ చివరికి డిఫెన్స్ వైపు నిలిచారు. అయితే ఈ విచార‌ణ స‌మ‌యంలో స్పేసీ అంతటా మౌనంగా ఉండి డాక్ లో ఒంటరిగా కూర్చున్నాడని కూడా క‌థ‌నం వెల్ల‌డించింది.