Begin typing your search above and press return to search.
ముగిసిన భేటీ.. సినిమా టికెట్ ధరలపై కీలక నిర్ణయం..!
By: Tupaki Desk | 17 Feb 2022 9:30 AM GMTఆంధ్రప్రదేశ్ లో గత పది నెలలుగా కొనసాగుతున్న సినిమా టికెట్ రేట్ల వివాదానికి శుభం కార్డు పడుతుందని టాలీవుడ్ అంతా ఆశగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా టిక్కెట్ల రేట్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నేడు సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ తో పాటుగా ఇతర సభ్యులు హాజరయ్యారు.
సినిమా టిక్కెట్ మీద ఈరోజు ఉదయం నిర్వహించిన కీలక భేటీ ముగిసింది. వారం రోజుల్లో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం ప్రభుత్వం నుంచి వస్తుందని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లపై అన్ని అంశాలు చర్చించామని.. టికెట్ల రేట్ల విషయంలో 99 శాతం ప్రభుత్వం అనుకూలంగా ఉందని అన్నారు. మూడు స్లాబుల్లో టికెట్ల ధరలు ఉండనున్నట్లు చెప్పారు.
సీఎం భేటీ సందర్భంగా సినిమా పెద్దలు మాట్లాడిన విషయాలు కూడా ఇవాళ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిపారు. గతంలో పెట్టిన ప్రతిపాదనాలను కమిటీ ముందు ఉంచామని.. అన్నీ చర్చించి కమిటీ నివేదిక ఇచ్చాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అటు ప్రేక్షకులకు ఇటు ఇండస్ట్రీకి మంచి జరిగేలా.. ప్రభుత్వం నుంచి నిర్ణయం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రామదాసు.
సినీ ఇండస్ట్రీ కోసమే చిరంజీవి చర్చలు జరిపారని.. వంద కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వంద శాతం సీట్ల ఆక్యుపెన్సీ అమల్లోకి వచ్చిందని.. మాస్క్ మాత్రం తప్పనిసరిగా పెట్టాల్సిందేనని అన్నారు. మళ్ళీ సమావేశం ఉండొచ్చు.. ఉండకపోవచ్చని.. సానుకూలమైన వాతావరణం మాత్రం ఉందని అన్నారు.