Begin typing your search above and press return to search.
17న ప్రభుత్వ కమిటీ కీలక భేటీ.. 'భీమ్లా నాయక్' పరిస్థితేంటి..?
By: Tupaki Desk | 11 Feb 2022 4:30 PM GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల మీద తీసుకురాబోయే కొత్త జీవో కోసం టాలీవుడ్ అంతా ఆశగా ఎదురు చూస్తోంది. ఈ వారం మొదలుకొని సమ్మర్ సీజన్ ఎండింగ్ వరకు పెద్ద సినిమాల రిలీజులు ప్లాన్ చేసుకోవడంతో.. వీలైనంత త్వరగా దీనిపై ఏపీ సర్కారు ప్రకటన చేస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న (ఫిబ్రవరి 10) సీఎం జగన్ తో జరిగిన భేటీ పెద్ద రిలీఫ్ ఇచ్చిందని సినీ ప్రముఖులు పేర్కొన్నారు.
అంతేకాదు మరో పది రోజుల్లో.. ఈ నెలాఖరులోగా సినిమా టిక్కెట్ రేట్లు మరియు అదనపు షోపై సానుకూల నిర్ణయం వెలువడుతుందని తెలిపారు. అలానే ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏపీలో థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వడంతో పాటుగా నైట్ కర్ఫ్యూ ఎత్తేసే అవకాశం ఉండటంతో రిలీజ్ కు రెడీ అయిన సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ప్రభుత్వ జీవో 'భీమ్లా నాయక్' విడుదల కంటే ముందే వస్తుందా? లేదా తర్వాత వస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న లేటెస్ట్ మల్టీస్టారర్ మూవీ ''భీమ్లా నాయక్''. ఈ సినిమాను కుదిరితే ఫిబ్రవరి 25న.. కుదరకపోతే ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా రెడీగా ఉంది కాబట్టి.. పరిస్థితులు అనుకూలిస్తే ఈ నెల 25నే విడుదల చేసే అవకాశం ఉందని నిర్మాత చెబుతున్నారు. అయితే టికెట్ రేట్ల మీద ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యమైతే పరిస్థితేంటి? అనేది ప్రశ్నార్థకం అయింది.
సినిమా టిక్కెట్ ధరల క్రమబద్ధీకరణ నిమిత్తం ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ.. ఫిబ్రవరి 17న సమావేశం కానుందని వార్తలు వస్తున్నాయి. సినీ ప్రముఖులు చెప్పిన ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న వైయస్ జగన్.. వీటికి అనుగుణంగా నివేదిక రెడీ చేయమని ఆదేశించారని టాక్ వినిపిస్తోంది. 17న తుది సమావేశంలో ఈ విషయాలపై చర్చించిన తర్వాత ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది.
అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. కమిటీ భేటీలో చర్చించాలి.. రిపోర్ట్ రెడీ చేసి ప్రభుత్వానికి అందజేయాలి.. ఆ తర్వాత దాన్ని పరిశీలించి ప్రభుత్వం జీవో జారీ చేయడానికి ఎంతలేదన్నా 10 రోజులైనా పడుతుంది. దీనిని బట్టి ఎక్కువ శాతం ఫిబ్రవరి నాలుగో వారంలో ఉత్తర్వులు రావొచ్చు. ఒకవేళ కావాలని కాలయాపన చేస్తే ఇంకొన్ని రోజులు లేట్ అవ్వొచ్చు. ఇది కచ్చితంగా 'భీమ్లా నాయక్' సినిమా ఓపెనింగ్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు సినిమా టికెట్ ధరలతో సంబంధం లేకుండా.. 50 శాతం ఆక్యుపెన్సీ - రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తేసినా చాలు 'భీమ్లా నాయక్' ను థియేటర్లలోకి వదలాలని మేకర్స్ భావిస్తున్నారట. తెలుగుతో పాటుగా హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 25వ తేదీలోపు టికెట్ రేట్లపై జీవో వస్తే మాత్రం.. అది సినిమాకు చాలా బెనిఫిట్ అనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
కాగా, ‘భీమ్లా నాయక్’ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలను అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి అధికారిక రీమేక్ అనే సంగతి తెలిసిందే.