Begin typing your search above and press return to search.
రంగస్థలంలో అయిదుగురే కీలకం
By: Tupaki Desk | 12 March 2018 8:15 AM GMTసుకుమార్... చెర్రీ ప్రతిష్టాత్మకంగా చేసిన సినిమా రంగస్థలం. ఎప్పుడు నాన్న మాట వినే చెర్రీ... తొలిసారి తండ్రి చిరు చెప్పినా మార్పులు కూడా చేయడానికి రంగస్థలంలో చేసేందుకు ఇష్టపడలేదు. అంతగా ఆ సినిమాపై ఆశలు పెట్టేసుకున్నాడు. ఆ సినిమా కథ చెర్రీని బాగా ప్రభావితం చేసిందని... అలాగే సుకుమార్ టేకింగ్ కూడా అతడిలో నమ్మకాన్ని పెంచిందని అంటారు. ఆ సినిమాలో ముఖ్యమైన పాత్రలు అయిదేనట. ఆ పాత్రల చుట్టూనే కథ మొత్తం గింగిరాలు కొడుతుందంట.
హీరో హీరోయిన్లయినా చిట్టిబాబు... రామలక్ష్మి పాత్రలు ఎలాగూ ముఖ్యమైనవే. ఆ పాత్రలు అన్నింటి కంటా కీలకం కూడా. వీరితో పాటూ కథను మలుపుతిప్పుతూ.. ఆసక్తిని పెంచేలా చేసే క్యారెక్టర్లు జగపతిబాబు... ఆది... అనసూయ వేశారు. ఇందులో జగపతి బాబు మెయిన్ విలన్. ఇప్పటికే అతను అనేక చిత్రాల్లో విలన్ గా వేసి తనను తాను నిరూపించుకున్నాడు. కానీ సినిమాలో అతను వేసిన పాత్ర... నటన అద్భుతం అన్న టాక్ వస్తోంది. సినిమా చూశాక ఏం నటించాడు అని అనుకోకుండా ఉండలేమట.
అలాగే ఆది పినిశెట్టి... చిట్టిబాబు అన్న కుమార్ బాబుగా నటించాడు. అతని పాత్ర కూడా సినిమాకు కీలకమేనట. ఇప్పటికే మంచినటుడిగా పేరుతెచ్చుకున్న ఆదికి ఈ సినిమాతో మరింత పేరు రావడం ఖాయం అన్న సమాచారం అందుతోంది. ఇక ఇంతవరకు వెండితెరపై పెద్దగా ప్రాధాన్యమున్న పాత్ర వేయని అనసూయకు రంగస్థలం మెమరబుల్ అవుతుందని అంటున్నారు... ఆ చిత్ర యూనిట్.