Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ 2 .. ఇంకా కోర్టులో తేలలేదు
By: Tupaki Desk | 25 Sep 2019 7:13 AM GMTరాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన `కేజీఎప్ -చాప్టర్1` బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్1 ని మించిన బడ్జెట్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ `అధీరా` పాత్రలో నటిస్తుండడంతో అటు బాలీవుడ్ లోనూ ఈ చిత్రానికి హైప్ పెరిగింది. ఇటీవల సంజూ భాయ్ పై కీలక షెడ్యూల్ ని ప్రారంభించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. అయితే ఆదిలోనే హంసపాదులా కేజీఎఫ్ టీమ్ కి ఊహించని సమస్య ఎదురైంది కేజీఎఫ్ మైనింగ్ ని పర్యవేక్షించే.. జేఎంఎఫ్ సీ స్పెషల్ కోర్టులో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో షూటింగ్ ని ఆపేయాల్సి వచ్చింది.
కేజీఎఫ్ లోని సైనైడ్ హిల్స్ ఏరియాలో షూటింగ్ ని నిరాకరిస్తూ.. స్థానికుడు శ్రీనివాస కేజీఎఫ్ టీమ్ పై కేసు పెట్టారు. సైనైడ్ హిల్స్ ని నాశనం చేస్తూ సెట్స్ వేస్తే పర్యావరణ కాలుష్యం తలెత్తుతుందని అతడు వాదన వినిపించడంతో కోర్టు అతడికి అండగా నిలిచింది. కోర్టు స్టే ఆర్డర్ తో షూటింగ్ నిలిపేశారు.
అయితే ఈ విషయంలో కేజీఎఫ్ టీమ్ కు కన్నడ ఫిలించాంబర్ అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఛాంబర్ తరపున ఒక దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. షూటింగును ఆపేస్తూ కోర్టులో ఉన్న స్టే ఆర్డర్ ని ఎత్తేయాల్సిందిగా కోరుతూ ఈ దరఖాస్తును పెట్టుకున్నారు. ఇంతకీ ఈ దరఖాస్తులో ఏం ఉంది? అంటే..
``అసలు ఈ లొకేషన్ తో ఏ సమస్యా లేదు. అదే లొకేషన్ లో ఇప్పటికే అర్థ సంవత్సరం పాటు చిత్రీకరణ పూర్తి చేశారు. కేజీఎఫ్ 1 - 2 కలిపి ఇక్కడ అంతకాలం చిత్రీకరణ జరిగింది. అయితే ఇప్పుడే కొత్తగా ఏం సమస్య వచ్చింది? ఇప్పటికే షూటింగ్ జరిగింది మీరు చూడండి`` అంటూ కౌంటర్ ని దాఖలు చేశారు. కేజీఎఫ్ 2 కి కన్నడ ఫిలింఛాంబర్ సరోర్టుగా నిలవడంతో ఇప్పటికి టీమ్ లో నమ్మకం పెరిగింది. దీంతో ఎలాంటి ఆలస్యం కాకుండా చిత్రీకరణ పూర్తి చేసి చెప్పిన టైముకే కేజీఎఫ్ 2 చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆత్ర పడుతున్నారని తెలుస్తోంది.