Begin typing your search above and press return to search.

పోటీ బ‌రిలో ఈద్ విజేత‌గా KGF 2

By:  Tupaki Desk   |   3 May 2022 11:30 AM GMT
పోటీ బ‌రిలో ఈద్ విజేత‌గా KGF 2
X
పోటీ ఎంత ఉన్నా KGF 2 దూకుడు ముందు ఇంకేదీ నిల‌వ‌డం లేదు. అటు బాలీవుడ్ లో ఈ సినిమా కుమ్మేస్తోంది. మాస్ పిచ్చెక్కి థియేట‌ర్ల‌కు వ‌స్తుంటే ఇప్ప‌టికీ రోజుకు 10కోట్లు చొప్పున క‌లెక్ట్ చేస్తోంది. మూడోవారం నాలుగో వారంలోనూ కేజీఎఫ్ 2 హ‌వా ముందు ఇంకేదీ నిల‌వ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

ఈద్ సెల‌వుల్ని ప‌రిశీలిస్తే.. హిందీ బెల్ట్ లో 3 రోజుల్లో ₹21 కోట్లతో KGF చాప్టర్2 స్పష్టంగా ఇత‌ర సినిమాల్ని డామినేట్ చేసింది. కొత్త విడుదలలు హీరోపంతి 2 ఆల్ ఇండియా ₹14.5 కోట్లు (డిజాస్ట‌ర్) వ‌సూలు చేయ‌గా.. రన్ వే 34 ₹13 కోట్ల వ‌సూళ్ల‌తో (పేలవమే కానీ రైజింగ్ ట్రెండ్) పూర్తిగా వెన‌క‌బ‌డ్డాయి. ఇటీవ‌ల విడుద‌లైన ఈ రెండు సినిమాలు మూడో వారంలో ఆడుతున్న కేజీఎఫ్ 2ని డామినేట్ చేయ‌డంలో చ‌తికిల‌బ‌డ‌డం బాలీవుడ్ మీడియాలో ప్రముఖంగా చ‌ర్చ‌కు వచ్చింది.

దంగ‌ల్ రికార్డులు బ్రేక్ చేసి నం.2 గా

పెద్ద స్టార్లు న‌టించిన రన్ వే 34 - హీరోపంతి 2 మొదటి సోమవారం KGF 2 కంటే తక్కువ సంపాదించాయి. టిక్కెట్ కౌంటర్లలో (రూ. 6.50 కోట్లు) మంచి ఓపెనింగ్ పొందిన తరువాత టైగర్ ష్రాఫ్ హీరోపంతి 2 దాని మొదటి సోమవారం కలెక్షన్లలో భారీగా వెన‌క‌బ‌డింది. ఈ చిత్రం సోమవారం రూ. 1.10 కోట్లను మాత్ర‌మే రాబట్టగలిగింది.. ఇది ఆదివారం కలెక్షన్ (రూ. 4 కోట్లు) కంటే 72.5 శాతం తక్కువ.

అజయ్ దేవగన్ న‌టించి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `రన్ వే 34`.. హీరోపంటి 2 అదే రోజు విడుదల‌య్యాయి. ఇందులో దేవ‌గ‌న్ సినిమా కొంచెం మెరుగ్గా ఉంది. ర‌న్ వే 34 తొలి సోమవారం రూ. 2.25 కోట్లు రాబట్టిందని బాలీవుడ్ హంగామా నివేదించింది. మొదటి రోజు వసూళ్లు 3 కోట్లు మాత్ర‌మే కావడంతో సినిమా స్లో స్టార్ట్ అయింది. రన్ వే 34 - హీరోపంటి 2 రెండూ యష్ KGF చాప్టర్ 2 నుండి గట్టి పోటీని ఎదుర్కొంటున్నాయి. ఇది ఇప్పుడు మూడవ వారంలో బాగా ఆడుతోంది. అయినప్పటికీ హిందీ బెల్ట్ లో ఇంకా వ‌సూళ్ల ప‌రంగా మందగించే సంకేతాలు కనిపించడం లేదు. సోమవారం ఈ చిత్రం రన్‌వే 34 - హీరోపంతి 2 రెండింటి కంటే రూ. 3.75 కోట్లు ఎక్కువగా రాబట్టింది. దీనితో హిందీ బెల్ట్ లో సినిమా మొత్తం కలెక్షన్ (హిందీ) ఇప్పుడు రూ. 373.33 కోట్లకు చేరుకుంది.

ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్‌లో ఇలా పంచుకున్నారు, “#KGF2 2వ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ ఫిల్మ్‌గా అవతరించడానికి సిద్ధంగా ఉంది… అలాగే, #ఈద్ సెలవులు దాని ప్రయాణాన్ని ₹ 400 కోట్ల దిశగా వేగవంతం చేస్తాయి… ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్… [3వ వారం] శుక్రవారం 4.25 కోట్లు.. శని 7.25 కోట్లు.. ఆది 9.27 కోట్లు.. సోమ 3.75 కోట్లు. మొత్తం: ₹ 373.33 కోట్లు. #ఇండియా బిజ్. #హిందీ లో వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించారు.

387.38 కోట్లను ఆర్జించిన అమీర్ ఖాన్ దంగల్ జీవితకాల కలెక్షన్ ను KGF 2 త్వరలో దాటవచ్చు. కానీ బాహుబలి: ది కన్ క్లూజన్ (రూ. 510.99 కోట్లు) హిందీ వెర్షన్ జీవితకాల క‌లెక్ష‌న్ల‌ను అధిగమించడం కొంచెం సవాల్ గా అనిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.