Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌-2 క్రేజీ అప్డేట్‌.. పేలుతున్న డైన‌మైట్లు!

By:  Tupaki Desk   |   27 March 2021 7:27 AM GMT
కేజీఎఫ్‌-2 క్రేజీ అప్డేట్‌.. పేలుతున్న డైన‌మైట్లు!
X
హీరోకు ఫ్యాన్స్ ఉండ‌డం అత్యంత స‌హ‌జం.. ద‌ర్శ‌కుడికి అభిమానులు ఉండ‌డం కూడా కామ‌నే. కానీ.. ఒక సినిమాకు ఫ్యాన్స్ ఉండ‌డం అనేది వెరీ రేర్‌. అలాంటి సినిమానే కేజీఎఫ్‌-2. ఇప్పుడు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమాల్లో ముందు వ‌ర‌సలో ఉంది కేజీఎఫ్‌ చాప్ట‌ర్-2.

కన్నడ రాకింగ్‌ స్టార్ య‌ష్ హీరోగా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెర‌కెక్కించిన‌ ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఫ‌స్ట్ చాప్ట‌ర్ ఏ రేంజ్ లో మోగ‌మోగించిందో అంద‌రికీ తెలిసిందే. దీంతో సెకండ్ పార్ట్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేటయ్యింది. ఈ విష‌యాన్ని టీజ‌ర్ వ్యూసే చెప్పేశాయి.

మొదటి పార్టు కన్నా.. చాప్ట‌ర్‌-2 లో యాక్షన్ రీ-సౌండ్ అద్దిరిపోతుంద‌ని టీజర్ తోనే ప్రకటించాడు దర్శకుడు. యూట్యూబ్ లో వ్యూస్ తోపాటు లైక్స్, కామెంట్ల విషయంలో నెవ్వర్ బిఫోర్ రికార్డులను సెట్ చేసిందీ టీజర్. దీంతో.. ఈ సినిమా ఎప్పుడు చూద్దామా అని ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్‌.

అయితే.. ఆ మ‌ధ్య‌నే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ లో బిజీగా ఉంది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ అటు ‘సలార్’ షూట్ కొనసాగిస్తూనే.. ఈ పనులు కూడా చూసుకుంటున్నాడు. అలా.. నిర్విరామంగా వర్క్ చేస్తున్నాడు.

ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. హీరో యశ్ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టాడు. రికార్డింగ్ థియేటర్లో రాఖీబాయ్ డైలాగుల డైనమైట్స్ పేల్చేస్తున్నాడట. కన్నడతోపాటు హిందీ డబ్బింగ్ కూడా సొంతంగానే చెప్తాడని అంటున్నారు. ఆడియన్స్ హాట్ కేక్ లా ఎదురుచూస్తున్న ఈ మూవీ.. జూలై 16న రిలీజ్ కానుంది.