Begin typing your search above and press return to search.
క్రిస్మస్ ను మిస్ చేసుకున్న కేజీఎఫ్ మళ్లీ ఎప్పటికి?
By: Tupaki Desk | 5 Aug 2021 3:51 AM GMTకన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపు అన్నట్లుగా తెరకెక్కిన కేజీఎఫ్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమా కంటే పది రెట్లు బిగ్గెస్ట్ గా.. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తి అయ్యి నెలలు గడుస్తోంది. గత ఏడాది విడుదల అవ్వాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఈ ఏడాది జులైలో విడుదల చేసేందుకు అధికారికంగా తేదీని ప్రకటించారు. కాని సెకండ్ వేవ్ వల్ల మళ్లీ థియేటర్లు మూత పడ్డాయి. దాంతో కేజీఎఫ్ 2 విడుదల వాయిదా వేశారు.
ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేసే అవకాశం ఉందని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.. ఆ తర్వాత క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తారనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల సంజయ్ దత్ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆ సమయంలో కేజీఎఫ్ 2 లోని ఆయన లుక్ ను విడుదల చేశారు. ఆ సమయంలో విడుదల తేదీని కన్ఫర్మ్ చేస్తారని అంతా అనుకున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయడం ఖాయం అనుకుంటూ ఉన్న సమయంలో సంజయ్ దత్ పుట్టిన రోజు సందర్బంగా కూడా విడుదల తేదీ విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దాంతో క్రిస్మస్ కు ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ సమయంలోనే అల్లు అర్జున్ భారీ పాన్ ఇండియా సినిమా పుష్ప ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతున్న పుష్ప తో పాటు హిందీ సినిమా లాల్ సింగ్ చద్దా కూడా అదే టైమ్ కు రాబోతుంది. కేజీఎఫ్ 2 పాన్ ఇండియా లెవల్ లో విడుదల కావాల్సి ఉంది. కనుక ఈ రెండు సినిమాలు ఖచ్చితంగా ఆ సినిమాకు పోటీ ఉంటాయి. కనుక సరైన సమయంలో కేజీఎఫ్ 2 ను విడుదల చేయాలంటే ఖచ్చితంగా మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పుష్ప సినిమా కంటే ముందు కేజీఎఫ్ 2 విడుదల తేదీని ప్రకటించి ఉంటే అప్పుడు విడుదల విషయంలో ఇబ్బంది ఉండేది కాదు. కాని ఇప్పుడు కేజీఎఫ్ 2 విడుదల తేదీని ఎప్పటికి ఫిక్స్ చేస్తారు అనేది క్లారిటీ లేదు.
కేజీఎఫ్ 2 ఎప్పుడు వచ్చినా కూడా ఓ రేంజ్ లో ఓపెనింగ్స్ ను.. వసూళ్లను దక్కించుకోవడం ఖాయం. మంచి టైమ్ లో విడుదల చేస్తే కేజీఎఫ్ 2 భారీగా వసూళ్లను నమోదు చేస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కేజీఎఫ్ 2 సినిమా విడుదల తేదీ విషయంలో అందరి దృష్టి ఉంది. కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయం పట్టనట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ మూవీని పట్టాలెక్కించాడు. వరుసగా సలార్ తో పాటు ఆ తర్వాత సినిమాను కూడా ఆయన చేసేందుకు సిద్దం అయ్యాడు. పరిస్థితి చూస్తుంటే కేజీఎఫ్ 2 విడుదలకు ముందే సలార్ సినిమాను పూర్తి చేసి మరో సినిమాను కూడా ప్రశాంత్ నీల్ మొదలు పెట్టేలా ఉన్నాడు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కన్నడ సినీ ప్రేక్షకులు కేజీఎఫ్ 2 సినిమా విడుదల విషయంలో ప్రశాంత్ నీల్ ను ఒత్తిడి చేస్తున్నారు. కాని ఆయన మాత్రం విడుదల విషయంలో ఏమనుకుంటున్నాడు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.