Begin typing your search above and press return to search.
2022 ఇంకా సగం ఉండగానే నెం.1 తేలిపోయింది
By: Tupaki Desk | 5 Jun 2022 5:01 AM GMTప్రతి సంవత్సరం ఇండియన్ బాక్సాఫీస్ వద్దకు కొన్ని వందల సినిమాలు వస్తాయి. వాటిల్లో కొన్ని ప్లాప్ అయినా కొన్ని యావరేజ్ గా నిలిచినా కొన్ని సినిమాలు మాత్రం వందల కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలుస్తాయి. ఒక ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏది అనే విషయాన్ని సహజంగా ఆ ఏడాది చివర్లో చర్చించుకుంటాం. కాని 2022 సంవత్సరం ఇంకా సగంకు పైగా ఉండగానే ఈ ఏడాది బిగ్గెస్ట్ సినిమా ఏంటో తేలిపోయింది.
ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా గా కేజీఎఫ్ 2 నిలువబోతుంది. ఈ ఏడాదిలో ఇంకా ఏడు నెలల సమయం ఉంది. ఈ ఏడు నెలల సమయంలో వందల సినిమాలు వస్తాయి. అవేవీ కూడా కేజీఎఫ్ 2 ను క్రాస్ చేయలేవు అంటూ బల్లగుద్ది మరీ సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో క్రేజీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడికి సిద్దం అవుతున్నాయి. కాని కేజీఎఫ్ 2 ను బీట్ చేసే సత్తా ఉన్న సినిమాలు లేవు.
కేజీఎఫ్ 2 ను బీట్ చేయాలంటే రాజమౌళి సినిమా అయినా రావాలి.. లేదంటే మళ్లీ ప్రశాంత్ నీల్ చేసే సినిమా అయినా రావాలి. ఆ రెండు సినిమాలు కూడా ఈ ఏడాది విడుదల కాబోవడం లేదు. కనుక కేజీఎఫ్ 2 ఈ ఏడాది మేటి బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ మూవీ అనడంలో ఇసుమంతైన సందేహం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కేజీఎఫ్ 2 వసూళ్ల విషయానికి వస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు చేసింది. ఇక వరల్డ్ బాక్సాఫీస్ వద్ద పన్నెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఇంతటి భారీ వసూళ్లు సాధించిన కేజీఎఫ్ 2 ను బీట్ చేసే సత్తా ఏ బాలీవుడ్ సినిమాకు కూడా లేదు అంటున్నారు. త్వరలో విడుదల కాబోతున్న బాలీవుడ్ భారీ చిత్రం పృథ్వీరాజ్ కు కూడా లేదు అనేది చాలా మంది అభిప్రాయం.
కేజీఎఫ్ 2 తర్వాత స్థానంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా నిలుస్తుంది. అద్బుతమైన సినిమా గా టాక్ దక్కించుకున్న ఆర్ ఆర్ ఆర్ కూడా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే కాస్త ఎక్కువగా కేజీఎఫ్ 2 రాబట్టడంతో ఆర్ ఆర్ ఆర్ కాస్త నెం.2 స్థానం కు పడిపోయింది. ఈ ఏడాదిలో నెం.2 స్థానం ను కూడా ఆర్ ఆర్ ఆర్ నుండి మరే సినిమా లాగేసుకోలేక పోవచ్చు అనేది టాక్.