Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ 2 @ 17M.. ఇది బ్రేక్ అవ్వాలంటే ఎన్నాళ్లయ్యేనో!
By: Tupaki Desk | 28 May 2022 8:31 AM GMTసౌత్ సినిమాలు అంటే ఎక్కువ శాతం తెలుగు మరియు తమిళ సినిమాలనే హిందీ వారు పరిగణలోకి తీసుకునే వారు. కమర్షియల్ సినిమాలు అంటే తెలుగు మరియు తమిళ సినిమాలు మరియు మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు.. మంచి స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీస్ అయితే మలయాళం సినిమాల గురించి జాతీయ స్థాయిలో సౌత్ సినిమాల గురించి ఒకప్పుడు చర్చ జరిగేది. కన్నడ సినిమాల గురించి కనీసం చర్చ ఉండేది కాదు.
కమర్షియల్ గా వారిది చాలా లో రేంజ్.. ఇక గొప్ప అవార్డులు వచ్చే స్థాయిలో మంచి కాన్సెప్ట్ తో సినిమాలు కూడా ఏమీ చేయలేదు అనేది అప్పట్లో వాదన. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. కేజీఎఫ్ తర్వాత కన్నడ సినిమా గురించి గొప్పగా మాట్లాడుకోవడం మొదలు అయ్యింది. అదుగో ఇదుగో అంటూ చాలా మంది చాలా రకాలుగా ఇప్పడు కన్నడ సినిమా పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు.
కేజీఎఫ్ 2 ఏకంగా వెయ్యి కోట్లను పైగా వసూళ్లు చేయడంతో ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా నోరు వెళ్లబెడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ కంటే అధికంగా కేజీఎఫ్ 2 వసూళ్లు రాబట్టి ఇండియాస్ టాప్ 3 సినిమా గా నిలిచింది. ఇప్పడు కేజీఎఫ్ 2 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ విషయంలో ఇండియాస్ నెం.1 సినిమా గా కేజీఎఫ్ 2 నిలిచింది అంటూ యశ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రముఖ ఆన్ లైన్ టికెట్స్ బుకింగ్ పోర్టల్ అయిన బుక్ మై షో లో కేజీఎఫ్ 2 సినిమా కు సంబంధించిన టికెట్లు ఏకంగా 17 మిలియన్ లు అమ్ముడు పోయాయి. టికెట్లు కేవలం బుక్ మై షో లో మాత్రమే కాకుండా డైరెక్ట్ బుకింగ్ వద్ద మరియు ఇతర ఆన్ లైన్ బుకింగ్ పోర్ట్స్ లో కూడా అమ్మడు పోతాయి. కనుక ఎంతటి గొప్ప సినిమా అయినా కూడా పది మిలియన్ ల టికెట్లు బుక్ మై షో లో అమ్ముడు పోతే గొప్ప విషయం.
అలాంటిది ఏకంగా 17 మిలియన్ల మంది కేవలం బుక్ మై షో లో టికెట్లు కొనుగోలు చేసి సినిమాను చూడటం అంటే గొప్ప రికార్డు అనడంలో సందేహం లేదు. ఈ రికార్డును ఇప్పట్లో ఏ ఒక్క స్టార్ హీరో కాని... ఎంతటి గొప్ప ఫిల్మ్ మేకర్ కాని బ్రేక్ చేయలేక పోవచ్చు. ఒక సౌత్ సినిమా అది కూడా కన్నడ సినిమా ఇంతటి అరుదైన అద్బుతమైన రికార్డులను దక్కించుకుంటుందని కలలో కూడా ఊహించలేదు అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.