Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ 2 .. చెట్టు పేరుతో కాయలు అమ్మగలరా?
By: Tupaki Desk | 3 March 2021 12:30 AM GMTకేజీఎఫ్ చిత్రం పాన్ ఇండియా కేటగిరీలో బ్లాక్ బస్టర్ విజయం సాధించాక హోంబలే సంస్థ వెంటనే పార్ట్ 2ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ లాంటి టాప్ బాలీవుడ్ స్టార్ విలన్ అధీరాగా కనిపించనుండడం సర్వత్రా ఆసక్తిని పెంచింది. డబుల్ యాక్షన్ బొనాంజ! అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా పార్ట్ 2ని తెరకెక్కించారు. కేజీఎఫ్ 2 జూలై 6న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
అంటే బిజినెస్ పూర్తి చేయడానికి ఇంకో మూడు నెలల సమయమే మిగిలి ఉంది. ప్రస్తుతం కేజీఎఫ్ 2 బిజినెస్ ఎలా ఉంది? అంటే... కేజీఎఫ్ ఘనవిజయం నేపథ్యంలో చాప్టర్ 2 కి భారీగా రేట్లు చెబుతున్నారట. దీంతో డిస్ట్రిబ్యూటర్లు కొనేందుకు వెనకాడేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ సాధించిందని చెబుతూనే ప్రభాస్ తో సలార్ ట్యాగ్ ని కూడా కేజీఎఫ్ చాప్టర్ 2 బిజినెస్ కి ఉపయోగిస్తున్నారని తెలిసింది.
కేజీఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల హక్కుల కోసం 90కోట్ల వరకూ కోట్ చేస్తుంటే డిస్ట్రిబ్యూటర్లు నోరెళ్ల బెడుతున్నారని గుసగుస వినిపిస్తోంది. ఒక స్ట్రెయిట్ తెలుగు స్టార్ హీరోకే లేని రేటు ఇది! అన్న చర్చా సాగుతోంది. అయితే కేజీఎఫ్ క్రేజుతో తెలుగులోనూ యష్ అంత పెద్ద హిట్టు కొడతాడని చెబుతున్నారట. అయితే నష్టాలొస్తే సలార్ తో కవర్ చేయొచ్చన్న హింట్ ఇస్తోందట హోంబలే సంస్థ. క్రేజు ఉన్నా ఒక అనువాద చిత్రానికి అంత పెద్ద రేటు పెట్టడం అంటే అది సవాళ్లతో కూడుకున్నదేనని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని పంపిణీదారులు కెజిఎఫ్ చాప్టర్ 2 ను అధిక ధరలకు తీసుకోవడానికి సిద్ధంగా లేరని కూడా తెలుస్తోంది. ప్రస్తుతం బిజినెస్ అంతంత మాత్రమే అని తెలిసింది. ఈ సన్నివేశంలో ఇంకో మూడు నెలల్లో బిజినెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అయినా తెలుగు మార్కెట్ వరకూ ప్రభాస్ పేరు ఉపయోగించడం సరికాదన్న విశ్లేషణ సాగుతోంది. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 కి సంజయ్ దత్ చేరికతో అటు బాలీవుడ్ లో విపరీతమైన క్రేజు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ చాప్టర్1 సంచలన విజయం నేపథ్యం.. అధీరా పాత్ర దరిమిలా ట్రేడ్ లో చాప్టర్ 2 భారీ ధర పలికే అవకాశం ఉంది.