Begin typing your search above and press return to search.

'RRR' రికార్డుని తునాతున‌క‌లు చేసేసిన 'KGF-2'

By:  Tupaki Desk   |   8 May 2022 2:30 PM GMT
RRR రికార్డుని తునాతున‌క‌లు చేసేసిన KGF-2
X
పాన్ ఇండియా చిత్రాలుగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `ఆర్ ఆర్ ఆర్`..`కేజీఎఫ్‌-2` చిత్రాల మ‌ధ్య రిలీజ్ తేదీల ప‌రంగా వ్య‌త్యాసం ఉన్నా బాక్సాఫీస్ వ‌ద్ద పోరు మాత్రం నువ్వా? నేనా? అన్నంత‌గా కొన‌సాగుతుంది. దేశీయంగా అందులోనూ సౌత్ ప‌రంగా చూసుకుంటే ఏ సినిమా వ‌సూళ్లు టాప్ లో ఉంటాయ‌ని ఒక‌టే డిబేట్ న‌డుస్తోంది.

అయితే అన్నింటికి `కేజీఎఫ్ -2` తెర దించేసింది. దేశీయంగా `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్ల‌ని `కేజీఎఫ్-2` బ్రేక్ చేసింది. `ఆర్ ఆర్ ఆర్` ఫుల్ ర‌న్ లో ఇండియాలో 904 కోట్లు వ‌సూల్ చేసింది. దీంతో `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్ల‌ని `కేజీఎఫ్-2` కొట్ట‌డం క‌ష్ట‌మ‌ని..దరి దాపుల్లో కూడా రాలేద‌ని...మ‌హా అయితే 700-800 కోట్ల‌తో అకౌంట్ క్లోజ్ అవుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు సైతం భావించాయి.

కానీ వాట‌న్నింటిని `కేజీఎఫ్` బ్రేక్ చేసింది. ఇండియాలో `కేజీఎఫ్` 930 కోట్ల వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డుని లిఖించింది. స్థూలంగా ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే `ఆర్ ఆర్ ఆర్` 1127 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించింది. ఇప్ప‌టివ‌ర‌కూ `కేజీఎఫ్` 1107 కోట్లు వ‌సూళ్లు సాధించి 20 కోట్ల వ‌సూళ్ల‌లో వెనుక‌బ‌డి ఉంది. అయితే రెండు..మూడు రోజుల్లో బ్యాలెన్స్ 20 కోట్లు వ‌సూల్ చేయ‌డం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు

అది జ‌రిగిన వేళ `ఆర్ ఆర్ ఆర్` వ‌రల్డ్ వైడ్ రికార్డు కూడా చెరిగిపోయిన‌ట్లే. `కేజీఎఫ్ -2` కేవ‌లం ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ నే మెప్పించింది. ఫ్యామిలీ ఆడియ‌న్స్ ఈ సినిమాని పెద్ద‌గా చూడ‌లేదు. కానీ `ఆర్ ఆర్ ఆర్ `మాత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని మెప్పించింది. అలాగే హిందీలో `కేజీఎఫ్` కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర్ధం ప‌ట్టారు.

అక్క‌డే సునాయాసంగా 300 కోట్ల వ‌సూళ్లు సాధించింది. కానీ `ఆర్ ఆర్ ఆర్` కి హిందీ బెల్ట్ దెబ్బేసింది. నార్త్ ఆడియ‌న్స్ ని మెప్పించ‌డంలో `ఆర్ ఆర్ ఆర్` విఫ‌ల‌మైంది. లేదంటే `ఆర్ ఆర్ ఆర్` వ‌సూళ్లు అంత‌కు రెట్టింపు ఉండేవ‌న్న‌ది నిపుణుల మాట‌. ఈ విష‌యంలో జ‌క్క‌న్న అంచ‌నా త‌ప్పైంది.