Begin typing your search above and press return to search.
కేజీఎఫ్-2 కోసం కర్చీఫ్ వేసేశారా?
By: Tupaki Desk | 24 Jun 2021 7:30 AM GMTకరోనా సెకండ్ వేవ్ ధాటికి మరోసారి దేశవ్యాప్తంగా రెండు నెలలకు పైగా థియేటర్లు మూతపడగా.. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ షరతులు సడలిస్తుండటంతో త్వరలోనే వెండితెరల్లో వెలుగులు నిండుతాయని ఆశిస్తున్నారు. ఐతే థియేటర్లు పూర్తి స్థాయిలో నడవడానికి ఇంకా రెండు నెలలైనా పట్టొచ్చని భావిస్తున్నారు. కరోనా మూడో దశ ముప్పు లేకుంటే ఆగస్టు-సెప్టెంబరు మధ్య థియేటర్లకు కళ రావచ్చు. దేశవ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడవొచ్చు. ఆ సమయానికి థియేటర్లలోకి రావడానికి వివిధ భాషల్లో భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న సినిమాల్లో కేజీఎఫ్-చాప్టర్ 2 ఒకటి. రెండున్నరేళ్ల కిందట వచ్చిన కేజీఎఫ్-చాప్టర్ 1 ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. దీంతో చాప్టర్-2 మీద వివిధ భాషల ప్రేక్షకులు భారీ అంచనాలతో ఉన్నారు.
గత ఏడాది దసరాకే రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 16కు షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీని అందుకోవడం దాదాపు అసాధ్యమే. అప్పటికి థియేటర్లు పూర్తి స్థాయిలో నడిచే అవకాశాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ పాజిబుల్ రిలీజ్ డేట్ కోసం చూస్తున్న చిత్ర బృందం.. వినాయక చవితి మీద కన్నేసినట్లు సమాచారం. సెప్టెంబరు 10న చవితి కాగా.. ముందు రోజు కేజీఎఫ్-2ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కరోనా థర్డ్ వేవ్ ముప్పు లేకుంటే అప్పటికి థియేటర్లు కళకళలాడుతుంటాయని భావిస్తున్నారు. ఆ తేదీన కేజీఎఫ్-2 వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయం. పాన్ ఇండియా లెవెల్లో బాహుబలి-2కు దీటుగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఆలోచనతో మేకర్స్ ఉన్నారు. మరి చవితికి కేజీఎఫ్-2 సందడి ఉంటుందేమో చూద్దాం.