Begin typing your search above and press return to search.

విడుదల వాయిదా వేశారు.. అప్డేట్స్ ఇవ్వడం ఆపేశారు..!

By:  Tupaki Desk   |   22 Oct 2021 9:30 AM GMT
విడుదల వాయిదా వేశారు.. అప్డేట్స్ ఇవ్వడం ఆపేశారు..!
X
కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా ''కేజీయఫ్''. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ''కేజీయఫ్: చాప్టర్ 2'' రూపొందుతోంది. రాకింగ్ స్టార్ యష్ - డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమా విడుదలను వచ్చే ఏడాది ఏప్రిల్‌ కు వాయిదా వేశారు.

'కేజీయఫ్ 2' కొత్త విడుదల తేదీని ప్రకటించిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి న్యూ అప్డేట్ రాలేదు. రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉండటంతో ప్రశాంత్ నీల్ మరియు యష్ ఇద్దరూ ఇతర కమిట్మెంట్స్ తో బిజీ అయిపోయారు. దీంతో సినిమా ప్రమోషన్స్ దాదాపుగా నిలిచిపోయినట్లే అయింది. కనీసం ఫెస్టివల్ సీజన్స్ లో స్పెషల్ పోస్టర్స్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ ని కాస్త నిరాశకు గురి చేసింది.

నిన్న గురువారం (అక్టోబర్ 21) హీరోయిన్ శ్రీనిధి పుట్టినరోజు సందర్భంగా KGF 2 సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ అయినా విడుదల చేస్తారని అందరూ భావించారు. కానీ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపి సరిపెట్టుకున్నారు. ఇలాంటి ప్రత్యేక సందర్భంలో కూడా అప్డేట్లు లేకపోవడం సాధారణ సినీ అభిమానులను నిరాశపరిచింది. ఇది ఇలానే కొనసాగితే జనాలు సినిమాను పూర్తిగా మరిచిపోయే ప్రమాదం ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ఎదురు చూపులకు తగిన ఔట్ ఫుట్ వస్తుందని నమ్ముతున్నారు.

కాగా, 'కేజీయఫ్ 2' సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. చాప్టర్ 1 కు మించి యాక్షన్ సీన్స్ - ఎలివేషన్స్ ఉండబోతున్నాయని హింట్ ఇచ్చారు. ఇందులో బాలీవుడ్ స్టార్స్ సంజయ్‌ దత్‌ - రవీనా టాండన్ లతో పాటుగా ప్రకాష్ రాజ్ - రావు రమేష్ - ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.