Begin typing your search above and press return to search.
RRR కి పోటీగా KGF -2 ?
By: Tupaki Desk | 30 July 2019 1:30 AM GMTమోస్ట్ అవైటెడ్ 2019-20 సినిమాల జాబితాలో సౌత్ నుంచి ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా .. కేజీఎఫ్ 2 పేరు పాపులరవుతోంది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు 150-200 కోట్ల బడ్జెట్ తో కేజీఎఫ్ సీక్వెల్ ని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నేడు కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి అధీరా లుక్ రిలీజైంది. అధీరా పాత్రలో సంజయ్ దత్ ని చిత్రయూనిట్ కన్ఫామ్ చేస్తూ ఆయన బర్త్ డే సందర్భంగా పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ పోస్టర్ కి టాలీవుడ్ సర్కిల్స్ నుంచి చక్కని స్పందన వచ్చింది. దత్ చేరికతో కేజీఎఫ్ కి బాలీవుడ్ లోనూ మార్కెట్ పరంగా హైప్ పెరగనుంది. తాజాగా సమ్మర్ రేస్ లో కేజీఎఫ్ 2 రిలీజ్ ని చిత్రయూనిట్ ఖాయం చేసింది. దీంతో ఆర్.ఆర్.ఆర్ కి ఈ సినిమా పోటీకి రాబోతోందా? అంటూ మరో ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం.. కేజీఎఫ్ చిత్రీకరణ జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. ఇప్పటికే మైసూర్.. రామోజీ ఫిలింసిటీ షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ప్రస్తుతం కోలార్ మైన్స్ లో వేసిన భారీ సెట్స్ లో మూడో షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. కర్నాటక- భళ్లారిలో షెడ్యూల్ తో మెజారిటీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. తాజా షెడ్యూల్ తో 90శాతం చిత్రీకరణ పూర్తవుతుంది. సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఆ మేరకు చిత్రయూనిట్ నుంచి సమాచారం అందింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని సమ్మర్ కానుకగా జూలై 30న రాజమౌళి ఖాయం చేసిన సంగతి తెలిసిందే.
కేజీఎఫ్ 2 ప్రత్యేకత ఏమిటి? అంటే.. ఈ సినిమా కోసం కోలార్ గనుల్ని ప్రతిష్ఠించారట. భళ్లారిలో వేసిన భారీ సెట్స్ పార్ట్ 1 కంటే విజువల్ గ్రాండియారిటీతో మైమరిపిస్తాయని తెలుస్తోంది. అలాగే యాక్షన్ పార్ట్ లో బైక్ ఛేజ్ లు.. సాహసాలో ఒళ్లు గగుర్పొడిచేలా తీర్చిదిద్దుతున్నారట. ఈ సన్నివేశాల్లో యశ్ నటన నభూతోనభవిష్యతి అన్న తీరుగా చిత్రీకరిస్తున్నారట. తొలి భాగంలో మాఫియాని చూసి ఔరా! అనుకున్నవాళ్లంతా ఈ రెండో భాగంలో మాఫియాని చూశాక.. ఔరారా! అని ఆశ్చర్యపోతారట. ఇంత భారీతనంతో వీఎఫ్ ఎక్స్ మాయాజాలంతో పార్ట్ 2ని చూపించబోతున్నారట.