Begin typing your search above and press return to search.
KGF 2 - RRR - గంగూభాయి OTT స్ట్రీమింగ్ డేట్స్
By: Tupaki Desk | 25 April 2022 4:39 AM GMTకన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన K.G.F - చాప్టర్ 2 ఏప్రిల్ 14 న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి- రవీనా టాండన్ -సంజయ్ దత్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొడుతోంది. ఇది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో విజువల్ మిరాకిల్ గా పేరు తెచ్చుకుంది. ఇక పెద్ద తెర విజయంతో పాటు.. స్ట్రీమింగ్ ప్రీమియర్ తో ఇది విస్తృత స్థాయికి చేరుకుంటుందనడంలో సందేహం లేదు. మే నెలాఖరున ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ గా ప్రదర్శిస్తారని తాజాగా తెలిసింది.
ఈ చిత్రం మే 27 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం మొదటి భాగం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్ ప్రేక్షకుల నుంచి పార్ట్ 2 కి భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రం విడుదలైన రెండు రోజుల్లోనే భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసి రూ. కేవలం 5 రోజుల్లోనే 200 కోట్ల మార్కును సాధించింది. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోనూ చేరింది.
ఈ చిత్రం కన్నడ- తెలుగు- హిందీ- తమిళం- మలయాళ భాషల్లో విడుదలైంది. కె.జి.ఎఫ్- చాప్టర్ 2 ని ప్రశాంత్ నీల్ రచించి దర్శకత్వం వహించారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని నార్త్-ఇండియన్ మార్కెట్ లలో రితేష్ సిధ్వాని - ఫర్హాన్ అక్తర్ ఎక్సెల్ ఎంటర్ టైన్ మెంట్- AA ఫిల్మ్స్ అందిస్తున్నాయి.
కేజీఎఫ్ 2 పోస్ట్-క్రెడిట్స్ సన్నివేశంలో ఒక లైబ్రరీ ప్యూన్ వరుస ఫైల్ లను చూస్తున్నట్లు కనిపించాడు. అందులో ఒకటి `KGF - చాప్టర్ 3` శీర్షికతో కనిపించడం సందేహాలను క్రియేట్ చేసింది. అంటే కేజీఎఫ్ 3 కూడా ఉంటుందని ప్రశాంత్ నీల్ హింట్ ఇచ్చేశాడు. చాలా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాజిక్ తరహాలో KGF సిరీస్ మేకర్స్ తదుపరి వెంచర్ పై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించగలిగారు.
ఓటీటీలో RRR -గంగూభాయి డేట్స్
అలాగే జూన్ 3న ఆర్.ఆర్.ఆర్ కూడా ఓటీటీలో విడుదలవుతుండగా గంగూభాయి కతియావాడీ కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమైందని సమాచారం. రాజమౌళి- రామారావు- రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ థియేట్రికల్ గా సంచలన విజయం సాధించింది. ఈ మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ పైనా క్లారిటీ వచ్చేసింది.
అలాగే అభిమానుల నుండి విపరీతమైన ప్రేమ ను దక్కించుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న గంగూబాయి కతియావాడి ఏప్రిల్ 26 నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకొస్తోంది. గంగూబాయి కతియావాడి ఈ సంవత్సరం అత్యంత పాపులర్ భారతీయ చిత్రాలలో ఒకటి గా నిలిచింది. భారతదేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఇకపై ఓటీటీలో ఆనందించగలరని టీమ్ ఆశిస్తోంది. S. హుస్సేన్ జైద్ రచించిన- మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే పుస్తకం ఆధారంగా గంగూబాయి కతివాడి కథను రాసారు.
గుజరాత్ లోని ఒక చిన్న పట్టణమైన కతియావాడ్ కు చెందిన ఒక సాధారణ అమ్మాయి ఎదుగుదల చుట్టూ తిరిగే కథాంశమిది. ఆమెకు జీవితం విసిరిన సవాళ్లను స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదు. వేశ్యా వాటిక నేపథ్యంలో రాజకీయం అనేది ఆసక్తిని రేకెత్తించే అంశం. చలనచిత్రం థియేటర్లలో అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంది. సంగీతం- కళ సహా అన్ని భావోద్వేగాలను రేకెత్తించే విజుబిలిటీతో మెప్పించింది. సంజయ్ లీలా భన్సాలీ రచన - దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భన్సాలీ ప్రొడక్షన్స్ నిర్మించింది.