Begin typing your search above and press return to search.
నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారన్న స్టార్ హీరో
By: Tupaki Desk | 31 Dec 2020 12:30 AM GMTనా సాహసాన్ని డమ్మీని చేసి నన్ను అవమానించొద్దన్న స్టార్ హీరో మనోగతం అభిమానులను షాక్ కి గురి చేస్తోంది. ఇంతకీ కేజీఎఫ్ అధీరా సంజయ్ దత్ నే అవమానించారా? అంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
నిజానికి ఊపిరితిత్తుల క్యాన్సర్ మూడో దశకు చికిత్స తీసుకుని తిరిగి బెంగళూరు పరిసరాల్లోని మైనింగ్ గనుల్లో నటించేందుకు ఎలాంటి సంకోచం లేకుండా విచ్చేసిన సంజయ్ దత్ విషయంలో కేజీఎఫ్ 2 టీమ్ ఎంతో కలత చెందిందట. అతడి ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ అండ్ టీమ్ భావించారు.
భారీ యాక్షన్ సన్నివేశాల్లో దత్ సౌకర్యం కోసం అదనపు ఏర్పాట్లు చేయాలనుకున్నారు. కానీ స్పాట్ బాయ్ చెబుతున్న వివరం ప్రకారం వేటికీ సంజయ్ దత్ వెరవలేదు. సరికదా.. తన అసౌకర్యంపై చింత వద్దని తనని తక్కువ చేయవద్దని కూడా అన్నారట.
సంజయ్ దత్ అంకితభావం దీర్ఘదృష్టి పైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. క్యాన్సర్ కి చికిత్స పొందిన వెంటనే దత్ క్లిష్టమైన క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి వేచి ఉన్న కెజిఎఫ్ 2 సిబ్బందిలో చేరడానికి వెంటనే బెంగళూరుకు వెళ్ళాడు.
``టీమ్ ప్రధాన ఆందోళన మిస్టర్ దత్ ఆరోగ్యం. అతను సురక్షితమైన సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేయాలని కోరుకున్నారు. మిస్టర్ దత్ విన్యాసాలను సరళీకృతం చేయాలని యష్ సహా దర్శకుడు ప్రశాంత్ నీల్ సూచించారు. కానీ అతను దానికి ససేమిరా అన్నారు. ‘నేను యాక్షన్ సన్నివేశాలు చేయగల సామర్థ్యం లేదని సూచించడం ద్వారా నన్ను అవమానించవద్దు. నేను స్క్రిప్టులో రాసిన విధంగానే చేస్తాను.. రాజీ లేదు.. మోసం వద్దు`` అని దత్ అన్నారట. అతను స్టంట్స్ అన్నింటినీ స్వయంగా చేసారు. ప్రమాదకరమైనవి కూడా అతను బాడీ డూప్ ఉపయోగించేందుకు తిరస్కరించాడు. అధీరాగా అతను వాటిని ఖచ్చితంగా చేసి చూపించారు అని తెలిపాడు స్పాట్ బాయ్.
పోరాటం చిత్రీకరించిన ప్రదేశం దుమ్ముతో నిండిపోయింది. “యష్ సర్ దత్ సాబ్ స్థలాన్ని దుమ్ము లేకుండా ప్రతి షాట్ కు ముందు సరిగ్గా శుభ్రపరచాలని సూచించారు. కానీ దత్ సాబ్ నిరాకరించారు. అతను ‘నాపై కెమెరా షాట్లకు ముందు నేలను శుభ్రం చేస్తే అది తెరపై ఎలా కనిపిస్తుంది? ప్రతిదీ తెలిసిపోతుంది. ప్రేక్షకులు చాలా తెలివైనవారు.” అని అన్నారు. కెజిఎఫ్ 2 యూనిట్ కి సంజయ్ దత్ ఎంతో సహకరించారు. బాగా కలిసిపోయి ఆకట్టుకున్నారు. ``అతను ఒక పోరాట యోధుడు.. నిజ జీవిత హీరో`` అని టీమ్ పొగిడేస్తోంది.