Begin typing your search above and press return to search.
కేజీఎఫ్-2 Vs అఖండ! 7 రోజులు.. 96 రోజులు!!
By: Tupaki Desk | 26 Nov 2021 10:37 AM GMTటెక్నాలజీని పరిచయం చేసేందుకు టాలీవుడ్ ఉవ్విళ్లూరుతోంది. ఇక్కడ మన నిర్మాతలు పాన్ ఇండియా బడ్జెట్లను కుమ్మరిస్తూ భారీ చిత్రాల్ని నిర్మించేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. హాలీవుడ్ నుంచి హై ఎండ్ టెక్నాలజీని దిగుమతి చేస్తున్నారు.
ఇన్నాళ్లు బాలీవుడ్ కే సాధ్యం అనుకున్నవి ఇప్పుడు టాలీవుడ్ లోనూ సాధ్యమవుతున్నాయి. మన మార్కెట్ పరిధి విస్తరించిన క్రమంలో దానికి తగ్గట్టే బడ్జెట్లలో సాంకేతికతలో ఎక్కడా తగ్గడం లేదు.
ఇప్పుడు కేజీఎఫ్ 2 వర్సెస్ అఖండ! టెక్నో వార్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. అంతగా ఈ రెండు సినిమాల కోసం ఏ సాంకేతికతను ఉపయోగించారు అంటే.. ఆ ఇద్దరూ కామన్ గా ఓ హైఎండ్ టెక్ కెమెరాని ఉపయోగించడం చర్చనీయాంశమైంది.
భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ ఉపయోగించని పాన్ టైమ్ కెమెరాను అఖండ కోసం దాదాపు 96 రోజుల పాటు ఉపయోగించారట. ఆ మేరకు నిర్మాత రవీందర్ వివరాల్ని వెల్లడించారు. యాధృచ్ఛికంగా అదే పాన్ టైమ్ కెమెరాను KGF కోసం ఉపయోగించారు. కానీ కేవలం దానిని ఏడు రోజులు మాత్రమే ఉపయోగించారు. అఖండ కోసం ఏకంగా 96 రోజులు ఉపయోగించారు.
అఖండ భారీ యాక్షన్ చిత్రం. ఇందులో బాలయ్య యాక్షన్ విన్యాసాలు గగుర్పాటుకు గురి చేస్తాయని సమాచారం. ఆయన అఘోరాగానూ మరో లెవల్ చూపించబోతున్నారు.
ఇప్పటికే ఈ యాక్షన్ చిత్రంపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. టీమ్ హై ఎండ్ టెక్నాలజీని ఉపయోగించడంతో అభిమానులలో ఉత్సాహం మరింత పెరిగింది. అంతే కాకుండా అఖండలోని మాస్ సాంగ్ అభిమానుల గుండె కొల్లగొడుతుందని సమాచారం.
కేజీఎఫ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. ఇది కేజీఎఫ్ -1 కి సీక్వెల్ కాని కథతో భారీ యాక్షన్ తో రూపొందుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్- సంజయ్ దత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ రాజీ అన్నదే లేకుండా భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ మూవీ కోసం ఏడు రోజుల పాటు పాన్ టైమ్ కెమెరాను ఉపయోగించారు. సాంకేతికతతో పాటు లాజిక్ ని ఎవరు తెలివిగా ఉపయోగించారన్నది గెలుపును నిర్ణయిస్తుందన్నది అసలు నిజం.