Begin typing your search above and press return to search.
కెజిఎఫ్ హీరో జలయజ్ఞం
By: Tupaki Desk | 26 May 2019 5:34 AM GMTసినిమాల్లో హీరో పాత్రలు త్యాగాలు చేయడం జనం కోసం మంచి పనులు చేయడం చూస్తుంటాం కానీ నిజ జీవితంలో అలా ఆచరించే స్టార్లు తక్కువగా ఉంటారు. అందులో కెజిఎఫ్ హీరో ఒకరు. కర్ణాటకలో చాలా గ్రామాలకు శాపంగా మారిన నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు ప్రభుత్వాలు చేయలేని పనిని తాను చేసి చూపిస్తున్నాడు. యశోమార్గ పేరుతో యాష్ ఒక ఫౌండేషన్ స్థాపించాడు.
గుక్కెడు తాగు నీటికి నోచుకోని గ్రామాలను గుర్తించి అక్కడికి తన టీమ్ సభ్యులు అభిమానుల ద్వారా ట్యాంకర్లలో మంచి నీటిని సప్లై చేసి ప్రజల మన్ననలు అందుకుంటున్నాడు. ఒకేసారి రాష్ట్రంమొత్తం అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి జిల్లాల వారీగా పూర్తి చేస్తున్న యాష్ ఇప్పుడు రాయచూర్ నుంచి బీదర్ కు వచ్చాడు. అక్కడ జల సరఫరా మొదలైపోయింది. ఇప్పుడీ చర్యల ద్వారా యష్ ఆయా గ్రామస్థుల పాలిట దేవుడు అవుతున్నాడు. ఇది నిత్యం కొనసాగుతూనే ఉంటుందని యష్ స్పష్టం చేస్తున్నాడు.
హీరోయిన్ రాధికా పండిట్ ని పెళ్లి చేసుకోవడం చక్కని పాపకు తండ్రి కావడం కెజిఎఫ్ శాండల్ వుడ్ హిస్టరీలో అతి పెద్ద హిట్ గా నిలవడం ఇవన్నీ తనకు సంఘమే ఇచ్చిందని గుర్తించిన యష్ బాధ్యతగా మంచి చేసేలా ఆలోచించడం ఇంకొందరికి స్ఫూర్తి ఇస్తోంది. కెజిఎఫ్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న యష్ వచ్చే ఏడాది దాకా సిల్వర్ స్క్రీన్ పై దర్శనం ఇచ్చే ఛాన్స్ లేదు. రేంజ్ పెరిగిపోయింది కాబట్టి దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా కీలక మార్పులు చేసి చాప్టర్ 1కు పదింతలు హై వోల్టేజ్ ఉండేలా తీర్చిదిద్దుతున్నట్టు ఇన్సైడ్ టాక్