Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ తో వచ్చింది పాయే.. ఇప్పుడేంటి పరిస్థితి?

By:  Tupaki Desk   |   1 Sep 2022 6:19 AM GMT
కేజీఎఫ్ తో వచ్చింది పాయే.. ఇప్పుడేంటి పరిస్థితి?
X
కేజీఎఫ్ సినిమా లో యశ్‌ కు జోడీగా నటించిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి. కన్నడ తో పాటు అన్ని భాషల్లో కూడా ఈ అమ్మడికి గుర్తింపు దక్కింది. కేజీఎఫ్ రెండు పార్ట్‌ ల్లో కూడా ఈ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకున్నా కూడా హీరోయిన్ గా నటించడం వల్ల మంచి పేరు అయితే వచ్చింది. కేజీఎఫ్ చేస్తున్న సమయంలో తమిళ్ లో కోబ్రా సినిమాకు ఈ అమ్మడు కమిట్ అయ్యింది.

శ్రీనిధి శెట్టికి కేజీఎఫ్ సినిమా మంచి క్రేజ్ ను తెచ్చి పెట్టింది. ఆ క్రేజ్ తో ఈ అమ్మడికి పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయట. కానీ ఈమె మాత్రం గొంతెమ్మ కోరికలు కోరడంతో వచ్చిన అవకాశాలు చేజారాయి. కోబ్రా సినిమా తర్వాత తన క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అని.. అప్పుడు తాను ఏం చెప్తే అది అన్నట్లుగా ఇండస్ట్రీలో సాగుతుందని భావించింది. కానీ సీన్‌ రివర్స్ అయ్యింది.

కేజీఎఫ్ సినిమా తో వచ్చిన స్టార్‌ డమ్‌ మరియు క్రేజ్ తాజాగా కోబ్రా విడుదల అయ్యి డిజాస్టర్‌ అవ్వడంతో పోయింది అంటున్నారు. సోషల్‌ మీడియాలో మొన్నటి వరకు శ్రీనిధి గురించి చాలా మంది పాజిటివ్‌ గా మాట్లాడేవారు. కానీ కోబ్రా విడుదల తర్వాత ఆ అమ్మడి పై నెగటివ్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. ఆమె సినీ కెరీర్‌ ముందుకు సాగడం అనుమానమే అన్నట్లుగా కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

కేజీఎఫ్ క్రేజ్ ను సద్వినియోగం చేసుకుని నాలుగు అయిదు సినిమాలకు కమిట్ అయ్యి ఉంటే అందులో రెండు మూడు సినిమాలు సక్సెస్ అయినా కూడా కోబ్రా ఫెయిల్యూర్‌ ను తట్టుకునేది.

కానీ ఇప్పుడు ఈ అమ్మడు పెద్దగా సినిమాలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. దాంతో కోబ్రా ఎఫెక్ట్‌ ను చూపించి చాలా మంది ఆమెను పక్కకు ఉంచే అవకాశం ఉంది.

మొత్తానికి శ్రీనిధి శెట్టి కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోక పోవడంతో కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ సినిమా ను దానితో వచ్చిన క్రేజ్ ను సద్వినియోగం చేసుకోవడం లో విఫలం అయ్యింది. ముందు ముందు అయినా ఈ అమ్మడికి అదృష్టం కలిసి వచ్చి మళ్లీ సినిమాల్లో ఆఫర్లు వచ్చి సక్సెస్‌ అయ్యి స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు వచ్చేనా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.