Begin typing your search above and press return to search.

వీక్ష‌కుల‌కు షాకిచ్చిన అమెజాన్‌

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 AM GMT
వీక్ష‌కుల‌కు షాకిచ్చిన అమెజాన్‌
X
రాఖీభాయ్ య‌ష్ హీరోగా న‌టించిన సంచ‌ల‌న చిత్రం `కేజీఎఫ్ 2` ఇటీవ‌ల విడుద‌లై దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తూ రికార్డులు సృష్టిస్తోంది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో సంచ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నఈ మూవీ బాలీవుడ్ లో ఇప్ప‌టికే రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. 400 కోట్ల పై చిలుకు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి హిందీ చిత్రాల‌నే వెన‌క్కి నెట్టేసింది.

మేకింగ్ టేకింగ్ ప‌రంగా ఈ మూవీని ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటూ ఇప్ప‌టికే 1175 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. నెల రోజులు దాటినా ఇప్ప‌టికి థియేట‌ర్ల‌లో త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగిస్తూనే వుంది. ఇప్ప‌టికి చూసిన వాళ్లే ఈ మూవీని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ఆమెజాన్ ప్రైమ్ లో చూసేయాల‌ని చాలా మంది ఓటీటీ ప్రియులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.

తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ హ‌క్కుల్ని ద‌క్కించుకుంది. ఇదిలా వుంటే చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ ని స్టార్ట్ చేసి షాకిచ్చింది. చాలా రోజులుగా థియేట‌ర్ కు వెళ్లని వీక్ష‌కులు ఈ మూవీని ఓటీటీలో చూడాల‌ని భావించారు. అయితే వారికి అమెజాన్ ప్రైమ్ ఊహించ‌ని షాకిచ్చింది. పే ప‌ప‌ర్ వ్యూ ప‌ద్ద‌తిలో ఈ మూవీ స్ట్రీమింగ్ కి అందు బాటులో వుంద‌ని ప్ర‌క‌టించింది.

అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీని చూడాలంటే స‌బ్స్ స్క్రిప్ష‌న్ తీసుకున్న వాళ్లైనా స‌రే అద‌నంగా రూ. 199 క‌ట్టాల్సిందే అనే నిబంధ‌న‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది. దీనిపై వీక్ష‌కులు, నెటిజ‌న్స్ మండిప‌డుతున్నారు. సైలెంట్ గా సినిమాని స్ట్రీమింగ్ కి పెట్టేసి అద‌నంగా డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం ఏమీ బాగాలేద‌ని, ఇదొక దిక్కుమాలిన చ‌ర్య అని అమెజాన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఆమెజాన్ పే ప‌ర్ వ్యూ విధానం దారుణంగా ఫెయిల్ అయింద‌ని తెలుస్తోంది.

తాజా విధానంపై ఓ నెటిజ‌న్ తీవ్రంగా స్పందించాడు. ఏడాదికి సినిమాల కోసం స‌బ్స్ స్క్రిప్ష‌న్ కింద‌ రూ. 1499 చెల్లిస్తూ వున్నామని, అలాంటి మాపై అద‌న‌పు భారం వేయ‌డం ఏమీ బాగాలేద‌ని విరుచుకుప‌డ్డాడు. చాలా మంది ఇంటి అద్దె చెల్లించిన‌ట్టుగా పే రెంట్ విధానాన్ని అమ‌ల్లోకి తీసుకురావ‌డంలో మీ ఆంత‌ర్యం ఏంటీ? అని నెటిజ‌న్ లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఇక నుంచి అమెజాన్ ప్రైమ్ పే రెంట్ పర్ వ్యూ విధానంలో న‌డుస్తుంద‌ని ఇటీవ‌ల వెల్ల‌డించిన అమెజాన్ ప్రైమ్ కు తాజాగా వీక్ష‌కులు గ‌ట్టి షాక్ ఇచ్చారు.

జీ5 కూడా ఇదే విధానాన్ని ముందు చెప్పి మ‌రీ అమ‌లు చేస్తోంది. అయితే దీని ఏడాది స‌బ్స్ స్క్రిప్ష‌న్ రూ. 699 మాత్ర‌మే. కానీ అమెజాన్ అలా కాదు. ఏడాదికి స‌బ్స్ స్క్రిప్ష‌న్ కింద‌ రూ. 1499 వ‌సూలు చేస్తోంది. అద‌నంగా కేజీఎఫ్ 2 కోసం రూ. 199 ని డిమాండ్ చేస్తుండ‌టం ఇప్ప‌డు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింది. గ‌తంలో ఇలాంటి ప‌ద్ద‌తినే అమ‌ల్లోకి తీసుకురావాల‌ని ప్ర‌య‌త్నించి బొక్క‌బొర్లా ప‌డ్డారు. ఇప్ప‌డూ అదే జ‌ర‌గ‌బోతోంద‌ని నెటిజ‌న్ లు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతుండ‌టం విశేషం.