Begin typing your search above and press return to search.
ఫలక్ నుమాలో దాక్కున్న డాన్ గుట్టు రట్టు!
By: Tupaki Desk | 21 Feb 2020 9:34 AM GMTహైదరాబాద్ ఫలక్ నుమా ప్యాలెస్ కి ఉన్న గుర్తింపు ఎలాంటిదో తెలిసిందే. పాతబస్తీలో ఎంతో ప్రాచీన చరిత్ర .. సంస్కృతికి చిరునామాగా నిలిచింది ఈ భవంతి. నాడు రాచరికంలో ఈ ప్యాలెస్ ఎంతో పాపులర్. అయితే అనంతర కాలంలో మోడ్రన్ వరల్డ్ కి తగ్గట్టు ఇది ఒక స్టార్ హోటల్ గా రూపాంతరం చెందింది. ఈ ప్యాలెస్ లో పలువురు సినీరాజకీయ సెలబ్రిటీల వివాహాలు గతంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకుముందు సల్మాన్ భాయ్ తన గారాల చెల్లెలు అర్పిత వివాహ వేడుక సెలబ్రేషన్స్ ని ఈ ప్యాలెస్ లోనే జరిపించారు. దాంతో ఫలక్ నుమా ప్యాలెస్ గురించి.. అక్కడ రుచికరమైన మెనూ గురించి జనం రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఖరీదును పట్టించుకోకపోతే.. ఇక్కడ విందు సంథింగ్ స్పెషల్ అన్న ముచ్చటా సాగింది. సామాన్యుడికి అందుబాటులో ఉండనంత కాస్ట్ లీ ఇది.
తాజాగా మరోసారి ఫలక్ నుమా ప్యాలెస్ వార్తల్లోకి వచ్చింది. ఈసారి అందుకు కారకుడు కన్నడ రాకింగ్ స్టార్ యశ్. ప్రస్తుతం అతడు నటిస్తున్న క్రేజీ చిత్రం కేజీఎఫ్ 2 షూటింగ్ ఈ ప్యాలెస్ లోనే జరుగుతోంది. నిజానికి కేజీఎఫ్ సీక్వెల్ షూటింగ్ ని మెజారిటీ పార్ట్ కర్నాటక -భళ్లారి పరిసరాల్లో పూర్తి చేయాలని భావించినా చిత్ర బృందానికి కొన్ని సమస్యలు తలెత్తాయి. లొకేషన్ చిక్కులతో పాటు.. కొన్ని చట్ట పరమైన సమస్యల అనంతరం హైదరాబాద్ కి షిఫ్టయ్యారు. ఇక్కడ సిటీలో రకరకాల చోట్ల షూటింగులు చేశారు. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించారు.
ప్రస్తుతం కొన్ని సీన్లు ఫలక్ నుమా ప్యాలెస్ లో చిత్రీకరిస్తున్నారు. తాజా సమాచారం తెలిసి.. ఇంతకీ రాకీ భాయ్ రాకతో ఈ ప్యాలెస్ కాస్తా డాన్ హౌస్ గా మారిందా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. డాన్ కి ఇది నిలయంగా మారిందా? అంటూ సందేహం వ్యక్తమవుతోంది. బంగారు గనుల మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ సినిమా ఇది. ఇందులో అధీరా (సంజయ్ దత్) అనే భయంకరమైన విలన్ కూడా ఉన్నాడు. ఇటీవల యశ్ - దత్ పై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఫలక్ నుమా ప్యాలెస్ లో ఎలాంటి సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏదైనా ప్రస్తుతం ఫలక్ నుమా ప్యాలెస్ ప్రాంతం ఉన్నట్టుండి రద్దీగా మారిందిట. యశ్ ఫ్యాన్స్ అంతా ఆ ప్యాలెస్ వైపు వెళుతున్నారట. ఇక్కడ తినడానికని వెళ్లి రాకింగ్ స్టార్ ని చూసి వస్తున్నారట. ఇదంతా చూస్తుంటే యశ్ కి ఇక్కడ ఆ రేంజులో ఫాలోయింగ్ ఉందా? అంటూ చిత్రబృందం ఆశ్చర్యపోతున్నారట. తెలుగు ఆడియెన్ భాషతో సంబంధం లేకుండా హీరోల్ని ఆదరిస్తుంటారనడానికి ఇంతకంటే వేరొక ప్రూఫ్ అక్కర్లేనట్టే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేజీఎఫ్ 2 టీమ్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీ జూలై 30ని లాక్ చేసిన సంగతి తెలిసిందే.