Begin typing your search above and press return to search.

బాహుబ‌లి 2ని వెన‌క్కి నెట్టిన రాఖీభాయ్‌

By:  Tupaki Desk   |   30 May 2022 11:30 AM GMT
బాహుబ‌లి 2ని వెన‌క్కి నెట్టిన రాఖీభాయ్‌
X
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా న‌టించిన క్రేజీ మూవీ 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఈ మూవీ కోసం దాదాపు నాలుగేళ్లుగా ఎదురుచూశారు. ప్ర‌శాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ పీరియాడిక్ ఫిక్ష‌న‌ల్ ఫాంట‌సీ యాక్ష‌న్ డ్రామా తొలి పార్ట్ కి మించి విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి పాన్ ఇండియా వైడ్ గా స‌రికొత్త రికార్డుల్ని తిర‌గ‌రాసింది. ఉత్త‌రాదిలో మ‌రీ ముఖ్యంగా హిందీ బెల్ట్ లో ఈ మూవీ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.

అక్క‌డ భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ బాలీవుడ్ మేక‌ర్స్ తో పాటు ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది. సినిమా విడుద‌లై నెల రోజులు దాటినా ఇప్ప‌టికీ త‌న దేశ వ్యాప్తంగా త‌న హ‌వాని కొన‌సాగిస్తూ వ‌రుస రికార్డుల్ని తుడిచిపెడుతోంది.

హిందీ మార్కెట్ లో రూ. 400 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. బాలీవుడ్ లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రాల్లో నెంబ‌ర్ వ‌న్ గా నిలిచిన 'దంగ‌ల్‌' మూవీని వెన‌క్కి నెట్టి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

అంతే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. 1200 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన సినిమాగా మ‌రో రికార్డుని న‌మోదు చేసింది. ఇదిలా వుంటే తాజాగా రాఖీభాయ్ ఖాతాలో మ‌రో రికార్డ్ వ‌చ్చి చేరింది. తాజాగా సాధించిన స‌రికొత్త రికార్డ్ తో రాఖీభాయ్ ఏకంగా 'బాహుబ‌లి 2'నే వెన‌క్కి నెట్టేయ‌డం విశేషం. ఇప్ప‌టికే ప‌లు రికార్డుల్ని సొంతం చేసుకున్న 'కేజీఎఫ్ 2' ఇండియాలో అత్య‌ధికంగా ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌లో చూసిన సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. ఇదే కాకుండా తాజాగా మ‌రో రికార్డుని ద‌క్కించుకోవ‌డం విశేషం.

తాజాగా బుక్ మై షోలో 'కేజీఎఫ్ 2' అరుదైన రికార్డుని సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన చిత్రాల్లో 17.1 మిలియ‌న్ టికెట్ లు బుక్ మై షో లో అమ్ముడు పోయిన సినిమాగా 'కేజీఎఫ్ 2' రికార్డుని సొంతం చేసుకుంది.

ఇంత‌కు ముందు ఈ రికార్డ్ 'బాహుబ‌లి 2' సొంతం. 'బాహుబ‌లి 2' బుక్ మై షోలో 17 మిలియ‌న్ ల టికెట్ ల‌ని అమ్ముడు పోయిన సినిమాగా రికార్డ్ సాధిస్తే ఆ రికార్డుని తాజాగా 'కేజీఎఫ్ 2' అధిగ‌మించి 'బాహుబ‌లి 2' ని వెన‌క్కి నెట్టి నెంబ‌ర‌న్ వ‌న్ స్థానంలో నిలిచింది.