Begin typing your search above and press return to search.
150 కోట్ల క్లబ్ లో కెజిఎఫ్
By: Tupaki Desk | 29 Dec 2018 3:30 PM GMTమొదటి రోజు యావరేజ్ అన్నారు.. ఆ తర్వాత ఫర్వాలేదు ఆడొచ్చన్నారు.. అటుపై సైలెంట్ హిట్ అంటూ మాట మార్చారు. ఇప్పుడు ఏకంగా బ్లాక్ బస్టర్.. రికార్డ్ హిట్.. సెన్సేషనల్ హిట్.. అంటూ పొగిడేస్తున్నారు. కన్నడలో ఏకైక 100కోట్ల క్లబ్ సినిమా.. కొద్దిరోజుల్లోనే 150కోట్ల క్లబ్ లో అడుగుపెడుతున్న సంచలనాల సినిమా కాబోతోంది. ఇంతటి బిగ్ సెన్సేషన్ చిత్రయూనిట్ సైతం ఊహించలేదు. ఇంతకీ.. ఆ సినిమా ఏది? అంటే `కె.జి.ఎఫ్` గురించే ఇదంతా.
కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో మాఫియా - బానిసత్వం కథతో తీసిన ఈ సినిమా సంచలనాల గురించి అన్ని ఇండస్ట్రీల్లో మోతెక్కిపోతోంది. కర్నాటకలో అతి పెద్ద హిట్. బాలీవుడ్‌లో బంపర్ హిట్. షారూక్ జీరో ను రేసులో వెనక్కి నెట్టి పెద్ద విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగులోనూ చెప్పుకోదగ్గ విజయం సాధించింది. తాజాగా తొలి వారం అంటే 7రోజుల వసూళ్ల లెక్కలు వచ్చాయి.
నాలుగు రోజుల్లో 100కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఈ సినిమా తొలి వారం తర్వాత చక్కని ఊపుతో వసూళ్లు సాధిస్తోంది. ఈ హుషారులోనే రూ.150కోట్ల క్లబ్ వైపు పయనిస్తోందిట. అంతిమంగా 250కోట్ల వరకూ స్టామినా చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఆ మేరకు వసూళ్లు పెరుగుతుండడం ట్రేడ్ నిపుణుల్ని ఆశ్చర్యపరుస్తోందట. తెలుగు రాష్ట్రాల్లో తొలివారం రూ. 5 కోట్లకు పైగా షేర్ - రూ.9.6 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నైజాంలో రూ.2 కోట్లు - సీడెడ్ లో 1కోటి వసూలైంది. ఉత్తరాంధ్రలో 60 లక్షలు - గుంటూరు రూ.40 లక్షలు, తూ.గో జిల్లాలో రూ.27 కోట్లు - ప.గో జిల్లాలో 22 లక్షలు సాధించింది. అమెరికాలో 522,848 డాలర్లు వసూలు చేసింది. గల్ఫ్ సహా అన్ని దేశాల్లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. విజయ్ కిరంగదుర్ నిర్మించారు. ప్రస్తుతం సీక్వెల్ సినిమాపైనా కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది.