Begin typing your search above and press return to search.
యష్ మేనియా పీక్స్..డైలాగ్ ని అక్కడ వాడేశారు
By: Tupaki Desk | 20 April 2022 2:05 PM GMTయష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 2` ప్రపంచ వ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఎక్కడా చూసినా.. ఏ నోట విన్నా కేజీఎఫ్ 2 మాటే. అంతా రాఖీ భాయ్ మేనియా పాకిపోయింది. జనానికి మాస్ హిస్టీరియా సోకిందా? అని ఆశ్చర్యపోయేంతగా ఈ సినిమా క్రేజ్ వైరల్ గా మారి పీక్స్ కి చేరుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లు కూడా ఇవదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 14న భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించి దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ప్రశాంత్ నీల్ టేకింగ్, సినిమాని నడిపించిన తీరుతో పాటు యష్ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కన్నడ చిత్రమైనా ఈ చిత్రానికి ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా వున్న సినీ లవర్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాపై నార్త్ ప్రేక్షకులు కాసుల వర్షం కురిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బ్యాక్ టు బ్యాక్ సౌత్ సినిమాలకు నార్త్ ప్రేక్షకులు అగ్రతాంబూలం ఇస్తున్న తీరు సినీ పండితుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇప్పటికే ఈ మూవీ పలు రికార్డుల్ని అధిగమించి 600 కోట్ల మైలు రాయికి చేరినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫిగర్ మరింతగా పెరిగే అవకాశం వుందని దీని దెబ్బకు పలు క్రేజీ చిత్రాల రికార్డు లు తుడిచి పెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదని సినీ పండితులు చెబుతున్నారు. ఇదిలా వుంటే `కేజీఎఫ్ 2` క్రేజ్ పీక్స్ కు చేరింది. నెట్టింట ఈ సినిమాపై ఓ రేంజ్ లో చర్చ జరుగుతున్న వేళ తాజాగా ఓ వార్త సినిమా క్రేజ్ ఏ స్థాయికి చేరిందో స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో యష్ - సంజయ్ దత్ ని గాయపరిచే సందర్భంలో ఓ డైలాగ్ వుంటుంది. అది ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతోంది. `వయిలెన్స్ వయిలెన్స్..వయిలెన్స్..ఐ డొన్ట్ లైక్ వయిలెన్స్ ఐ అవైడ్.. బట్ వయిలెన్స్ లైక్స్ మీ.. ఐ కాంట్ అవైడ్` అనే డైలాగ్ ట్రైలర్ లో పాపులర్ అయింది. ఇదే డైలాగ్ ని ఓ పెళ్లికి అన్వయించాడో అభిమాని. కర్ణాటకలోని బెళగావికి చెందిన చంద్రశేఖర్ అనే అభిమాని మే 13న శ్వేత అనే యువతిని వివాహం చేసుకోబోతున్నాడు.
ఇందు కోసం పెళ్లి పత్రికలు కూడా ప్రింట్ చేయించి పంచేశాడు. అయితే ఆ పత్రికల్లో యష్ నటించిన `కేజీఎఫ్ చాప్టర్ 2` చిత్రంలోని పాపులర్ డైలాగ్ ని తన పెళ్లికి అన్వయించుకుని వాడుకున్న తీరు కారణంగా అతని పెళ్లి పత్రిక ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. `మ్యారేజ్.. మ్యారేజ్.. మ్యారేజ్ .. ఐ డోన్ట్ లైక్ ఇట్..ఐ అవైడ్..బట్ మై రిలేటీవ్స్ లైక్స్ మ్యారేజ్.. ఐ కాంట్ అవైడ్..` అంటూ తన పెళ్లి పత్రికలో `కేజీఎఫ్ 2` డైలాగ్ ని వాడేశాడు. ఇప్పుడిది నెట్టింట వైరల్ గా మారింది.