Begin typing your search above and press return to search.

తారక్ అంత రిస్క్ తీసుకుంటాడా ?

By:  Tupaki Desk   |   5 Jun 2019 9:34 AM GMT
తారక్ అంత రిస్క్ తీసుకుంటాడా ?
X
నిన్న కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బర్త్ డే విషెస్ చెబుతూ మైత్రి సంస్థ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేయడం పెద్ద చర్చకే దారి తీసింది. ఇతన్ని లాక్ చేయాలనీ ఎందరో నిర్మాతలు ప్రయత్నించినా కేజిఎఫ్ 2 పేరుతో వాటిని తప్పుకుంటూ వచ్చాడు ప్రశాంత్. కాని మైత్రికి మాత్రం ఎందుకు ఎస్ చెప్పాడు అనేది భేతాళ ప్రశ్నగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ తో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారని ఆర్ ఆర్ ఆర్ తర్వాత తెరకెక్కించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఓ టాక్ బయలుదేరింది.

నిజంగా తారక్ ఇది ఓకే చేశాడా లేక వట్టి పుకార్ల వరకే ఇవి ఆగిపోతాయా ఇంకా తేలాల్సి ఉంది. హీరో ఎవరైనా మైత్రితో ప్రశాంత్ నీల్ జట్టు కట్టడం ఫిక్స్ అయిపోయింది, కాని ఇక్కడో చిక్కుముడి ఉంది. కేజిఎఫ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా ప్రశాంత్ నీల్ అనుభవం కేవలం రెండు సినిమాలే. మొదటిది ఉగ్రం కమర్షియల్ గా ఆడితే రెండోది కేజిఎఫ్ మీడియం రేంజ్ ఉన్న యష్ ని స్టార్ గా మార్చింది. సో ప్రశాంత్ కు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ ఉన్న స్టార్ ని డీల్ చేసిన అనుభవం లేదు.

అదేమంత సమస్య కాదు. అయితే తెలుగు నేటివిటీతో పెద్దగా టచ్ లేని తమిళ కన్నడ దర్శకులు గతంలో ఎలాంటి పొరపాట్లు చేశారో చూస్తూనే ఉన్నాం. మరి ప్రశాంత్ ను తారక్ ను ఎంతవరకు డీల్ చేయగలడు అనేది వేచి చూడాలి. పైగా కెజిఎఫ్ 2 ఫలితం కీలక పాత్ర పోషిస్తుంది. ఇదంతా చాలా లోతుగా వెళ్లి ఆలోచించినట్టు అనిపిస్తుంది కానీ అధికారిక ప్రకటన ఏమి లేదు కాబట్టి ఇప్పటికైతే ఇది గాసిప్ గానే తీసుకోవాలి. ఆర్ఆర్ఆర్ ఫినిషింగ్ స్టేజికి వచ్చాక కానీ తారక్ నెక్స్ట్ మూవీ మీద క్లారిటీ రాదు