Begin typing your search above and press return to search.

#HBD కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు హాలీవుడ్ ని ఢీకొట్టాలి

By:  Tupaki Desk   |   4 Jun 2021 3:30 PM GMT
#HBD కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు హాలీవుడ్ ని ఢీకొట్టాలి
X
ప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రు ద‌ర్శ‌కులు ఉన్నా కొంద‌రి పేర్లే ప‌దే ప‌దే వినిపిస్తాయి. ఆ కొంద‌రి ఆలోచ‌న స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా సాగుతుంది. ద‌క్షిణాదిన పాన్ ఇండియ‌న్ డైరెక్ట‌ర్లుగా శంక‌ర్ - మురుగ‌దాస్ వంటి పేర్ల‌తో పాటు ఎస్.ఎస్.రాజ‌మౌళి.. కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ అని ప‌దే ప‌దే వినిపిస్తున్నాయంటే వీళ్లంతా త‌మ రేంజ్ ను ఆ లెవ‌ల్లో చూపించారు కాబ‌ట్టే. వీళ్ల‌తో పాటు చాలామంది ట్రై చేసారు. కానీ చ‌తికిలబ‌డిపోయారు. కానీ గ్రేడ్ 1 ద‌ర్శ‌కులు త‌మ ప‌నిని ఎప్పుడూ ఆప‌లేదు.

ప్ర‌స్తుతం కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ పేరు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. ఒకే ఒక్క సినిమాతో అత‌డికి ఈ స్థాయి ద‌క్కింది. సైలెంటుగా దూసుకొచ్చిన కేజీఎఫ్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డ‌మే గాక క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. బాలీవుడ్ సినిమాల‌కే సాధ్యం కాని రేంజు చూపించింది. అందుకే ఆ ద‌ర్శ‌కుడి పేరును ప‌దే ప‌దే స్మ‌రిస్తున్నారు. ప్ర‌స్తుతం కేజీఎఫ్ 2 తో మ‌రిన్ని సంచ‌ల‌న‌లకు తెర లేప‌నున్నాడు. ఆ త‌ర్వాత పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో స‌లార్ లాంటి మ‌రో భారీ పాన్ ఇండియా సినిమాని తెర‌కెక్కిస్తూ నిత్యం జాతీయ వార్త‌ల్లోనూ హాట్ టాపిక్ గా మారాడు. అటుపైనా ఆర్.ఆర్.ఆర్ స్టార్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు ప్ర‌శాంత్ నీల్.

అత‌డి కోసం వ‌రుస‌గా పాన్ ఇండియా స్టార్లు వెయిటింగ్ లో ఉన్నారు. ఇదేమీ ఆషామాషీ ఫీట్ కాదు. కేజీఎఫ్ రాకీ భాయ్ య‌ష్ ఓ స‌మావేశంలో మాట్లాడుతూ ప్ర‌శాంత్ నీల్ హాలీవుడ్ సినిమా తీయాల‌ని అతడి స్థాయి ఆ లెవ‌ల్లో ఉంద‌ని ప్ర‌శంస‌లు కురిపించాడు. నేడు ప్ర‌శాంత్ నీల్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్ష‌లు తెలిపారు. కేజీఎఫ్ టీమ్ స‌లార్ టీమ్ కూడా అత‌డికి విషెస్ తెలిపారు. క‌ర్నాట‌క మ‌ట్టి నుంచి పుట్టిన బిడ్డ‌డు అత‌డు. కేజీఎఫ్ జ‌స్ట్ బిగినింగ్ మాత్ర‌మేనంటూ కీర్తించేస్తున్నారు. అత‌డు త‌న‌ని తాను ఇంకా ప్ర‌పంచానికి విస్త‌రిస్తాడ‌ని కేజీఎఫ్ తో అత‌డేంటో ప్ర‌పంచానికి అర్థ‌మైంద‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌శాంత్ నీల్ ఆన్ లొకేష‌న్ వ‌ర్కింగ్ విజువ‌ల్స్ ని తాజాగా రిలీజ్ చేయ‌డంతో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ట్యాలెంటెడ్ ప్ర‌శాంత్ నీల్ కి తుపాకి త‌ర‌పున పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. 2025 నాటికి అత‌డు హాలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ల టై అప్ తో అవెంజ‌ర్- అవ‌తార్- ఇన్సెప్ష‌న్ లాంటి విజువ‌ల్ గ్రాండియ‌ర్ ఫిక్ష‌న్ సినిమాని తీయాల‌నే ఆకాంక్షిద్దాం.