Begin typing your search above and press return to search.

కేజీఎఫ్‌ 2 లో సంజూ.. క‌న్ఫామ్ చేసిన య‌శ్‌

By:  Tupaki Desk   |   9 Feb 2019 1:53 PM GMT
కేజీఎఫ్‌ 2 లో సంజూ.. క‌న్ఫామ్ చేసిన య‌శ్‌
X
క‌న్న‌డ హీరో య‌శ్ న‌టించిన కేజీఎఫ్ సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. క‌న్న‌డ‌లో ఈ చిత్రం 100కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. స్వ‌రాష్ట్రంలో బాహుబ‌లి రికార్డును బ్రేక్ చేసింది ఈ చిత్రం. ఇక హిందీ, తెలుగులోనూ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా, బానిస‌త్వ ం నేప‌థ్య ంలో తెర‌కెక్కిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇది. ఇందులో య‌శ్ న‌ట‌న‌, ఎమోష‌న్ వ‌ర్క‌వుట‌వ్వ‌డం, క‌థాంశంలో కొత్త‌ద‌నం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఈ ఒక్క సినిమాతో ఇండియాలోనే టాప్ స్టార్ గా ఆవిర్భ‌వించాడు య‌శ్‌. ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడు నీల్ కి పేరొచ్చింది. హోంబ‌లే బ్యాన‌ర్ పేరు ప్ర‌పంచ‌వ్యాప్తంగా మార్మోగిపోయింది.

అయితే కేజీఎఫ్ ఒక ఫ్రాంఛైజీగా ర‌న్ అవుతోంద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. తొలిగా కేజీఎఫ్ - చాప్ట‌ర్ 1 రిలీజైంది. ప్ర‌స్తుతం కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2 ఆన్ సెట్స్ ఉంది. ఏడాది చివ‌రిలో చాప్ట‌ర్ 2 ని కూడా రిలీజ్ చేయ‌నున్నారు. ఆస‌క్తిక‌రంగా చాప్ట‌ర్ 1 స‌క్సెస్ నేప‌థ్య ంలో చాప్ట‌ర్ 2 స్పాన్ పెరుగుతోంది. తాజా సీక్వెల్ లో బాలీవుడ్ కండ‌ల హీరో సంజ‌య్ ద‌త్ విల‌న్ గా న‌టించ‌నున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నార‌ని హీరో య‌శ్ స్వ‌యంగా క‌న్ఫామ్ చేశారు. చాప్ట‌ర్ 1 స‌మ‌యంలోనే సంప్ర‌దించినా అప్పుడు సంజూ భాయ్ కి డేట్స్ కుద‌ర‌లేదని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌స్తుతం ద‌త్ ఓకే చేశారు. అప్ప‌టికి య‌శ్ ఎవ‌రో క‌ర్నాట‌క‌లో త‌ప్ప బ‌య‌ట ఎవ‌రికీ తెలీదు. ఇప్పుడు త‌నో పెద్ద స్టార్. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలుసు. అందుకే ఈ చిత్రంలో న‌టించేందుకు సంజ‌య్ ద‌త్ అంగీక‌రించార‌ని బాలీవుడ్ హంగామా పేర్కొంది. మొత్తానికి య‌శ్ - సంజ‌య్ ద‌త్ కాంబినేష‌న్ లో కేజీఎఫ్ - చాప్ట‌ర్ 2 ఇంకెన్ని ప్ర‌కంప‌నాలు సృష్టించ‌నుందో చూడాలి.