Begin typing your search above and press return to search.
నన్ను ప్రభాస్ తో పోల్చొద్దు ప్లీజ్
By: Tupaki Desk | 26 Nov 2018 2:57 PM GMTకన్నడ హీరో యష్ గురించి ఈమద్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో మరియు ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కన్నడ స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్న యష్ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కేజీఎఫ్ అనే చిత్రంతో రాబోతున్న విషయం తెల్సిందే. కన్నడంలో తెరకెక్కిన ఈ చిత్రంను తెలుగు - తమిళంలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే యష్ ను రాజమౌళి తన మల్టీస్టారర్ మూవీలో విలన్ గా తీసుకున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అని యష్ పేర్కొన్నాడు. తాజాగా ఇంకా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో యష్ షేర్ చేసుకున్నాడు.
‘కేజీఎఫ్’ చిత్రానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని యష్ పేర్కొన్నాడు. కేవలం ఈ చిత్రం కోసం 150 రోజులు కష్టపడ్డట్లుగా పేర్కొన్నాడు. ఇక ఇప్పటికే నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్న యష్ ‘కేజీఎఫ్’తో మరో అవార్డును తన ఖాతాలో వేసుకుంటాడని అంతా అంటున్నారు. అయితే అవార్డుపై యష్ మాట్లాడుతూ తనకు అవార్డులు ముఖ్యం కాదని, ఆడియన్స్ నా నటన చూసి, నా సినిమాలు చూసి క్లాప్స్ కొడితే అదే నాకు చాలు అన్నాడు. ఇక ఈమద్య ఎక్కువగా సౌత్ ఇండియాలో సెకండ్ ప్రభాస్ అంటూ యష్ ను తెగ సంబోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ స్పందిస్తూ.. తాను ఎప్పుడు సెకండ్ ఇండాలని కోరుకోను. నేను ఎప్పటికి మొదటి యష్ నే అన్నాడు. దయచేసి నన్ను ప్రభాస్ తో పోల్చవద్దని కోరాడు. ప్రభాస్ నటించిన చత్రపతి చిత్రం నాకు చాలా ఇష్టమని కూడా యష్ చెప్పుకొచ్చాడు. తెలుగులో ఈ చిత్రంతో మంచి గుర్తింపు దక్కించుకుంటే తెలుగులో సినిమాలు చేస్తారా అంటూ ప్రశ్నించగా తప్పకుండా మంచి సినిమాలు, మంచి కథలు వస్తే చేస్తానంటూ సమాధానం ఇచ్చాడు.