Begin typing your search above and press return to search.
రివైండ్.. KGF మ్యూజిక్ డాన్ పాండమిక్ లో అలా!
By: Tupaki Desk | 18 April 2022 3:16 AM GMTఅతడు సంగీతం అందించిన కేజీఎఫ్ సంచలన విజయం సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రోజుకు వంద కోట్లు వసూలు చేస్తూ పెను సంచలనంగా మారింది. అయితేనేం.. సీత కష్టాలు సీతవి.. పీత కష్టాలు పీతవి! అంటూ ఇప్పుడు నెటిజనులు షేర్ చేస్తున్న ఈ ఫోటోలు అంతర్జాలంలో హాట్ టాపిక్ గా మారాయి.
కరోనావైరస్ వ్యాప్తి పేద ప్రజల జీవితాలను ఎక్కువగా ప్రభావితం చేసింది. రోజువారీ కూలీ కార్మికుల జీవనోపాధి ఎక్కువగా దెబ్బతింది. సినీకార్మికులు టెక్నీషియన్లకు ఉపాధి పరంగా ముప్పు తప్పలేదు. అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా KGF కంపోజర్ రవి బస్రూర్ కూడా ఉపాధి హామీ లేక వేదన చెందాడు. తన తండ్రికి రోజుకు రూ. 35 సంపాదించి ఇవ్వడానికి సహాయం చేయడానికి తన గ్రామంలో కమ్మరిగా మారాడు.
కోవిడ్ వల్ల చిత్ర పరిశ్రమ బంద్ అవ్వడంతో అతడు ఉపాధి కోసం తన వారసత్వ వృత్తిని నమ్ముకున్నాడు. కష్ట కాలంలో ఉడిపి జిల్లా- కుందాపురా తాలూకాలోని తన గ్రామానికి వెళ్లి అతను తన తండ్రికి ఎలా సహాయం చేసాడో గుర్తు చేసుకుని మరీ కేజీఎఫ్ 2 విజయానంతరం ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రవి చాలా ట్యాలెంటెడ్. వరుసగా స్టార్ హీరోల చిత్రాలకు పని చేస్తున్నాడు. కానీ అలాగని అతడు తన రేంజును చూపించలేదు. కార్మికుడి కుమారుడు కార్మికుడేనని చెప్పేందుకు భేషజానికి పోలేదు ఆ సమయంలో. ఆసక్తికరంగా అతడు సల్మాన్ భాయ్ నటించిన భారీ చిత్రం `యాంటిమ్`కి కూడా సంగీతం అందించాడు. ఇప్పుడు ప్రభాస్ సాలార్ కి పని చేస్తున్నాడు. అంతటి ప్రతిభావంతుడు అయినా కానీ.. ఎంతో సాధాసీదాగా కనిపిస్తూ రవి అందరి మనసుల్ని దోచుకుంటున్నాడు.
మూలాల్ని మర్చిపోతే దాని పర్యవసానం అంతే ఇదిగా ఉంటుంది. కానీ అతడు తన మూలాల్ని మరువలేదు. తండ్రి వారసత్వంగా వచ్చిన వృత్తిని కించపరచలేదు. తన పనిని తాను చేస్తూ తన మనభీష్టాన్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేశాడు.
కేజీఎఫ్ చాప్టర్ 1 - కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలకు రవి బస్రూర్ అందించిన సంగీతం విమర్శకుల ప్రశంసలందుకుంది. అతడి సెలక్షన్ చాలా డిఫరెంట్ అని కూడా మన్ననలు దక్కాయి. పెద్ద చదువులు చదవి ఏ పనీ చేయని సోమరులున్న దేశంలో అతడు చాలా విభిన్నంగా ఆలోచించాడని కూడా అర్థమవుతోంది.