Begin typing your search above and press return to search.
కేజీఎఫ్ స్టార్ వారసుడు వచ్చాడు
By: Tupaki Desk | 30 Oct 2019 10:37 AM GMTకేజీఎఫ్ విడుదలకు ముందు యశ్ అంటే కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే కేజీఎఫ్ విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అప్పటి నుండి కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు తెలిసి పోయాడు. యశ్ ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతూనే జాతీయ స్థాయిలో గుర్తింపును కలిగి ఉన్నాడు. యశ్ ఇప్పటికే ఒక పాపకు తండ్రిగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సమయంలో యశ్ ఇంట వారసుడు పుట్టాడు.
బెంగళూరులోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో యశ్ భార్య నటి రాధిక పండంటి బాబుకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన విషయాన్ని యశ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఒక ఫొటోను షేర్ చేసి తన సంతోషాన్ని అభిమానులతో మరియు ఫాలోవర్స్ తో షేర్ చేసుకున్నాడు. పాప ఐరా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తూ ఉంటుంది.
ఇక యశ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కేజీఎఫ్ 2 చిత్రాన్ని చేస్తున్నాడు. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా రెండవ పార్ట్ కు భారీ స్థాయిలో క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ స్టార్స్ తో బాలీవుడ్ లెవల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మొదటి పార్ట్ కు మించి భారీ బడ్జెట్ ను ఈ చిత్రం కోసం ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కేజీఎఫ్ 2 తో మరోసారి యశ్ పాన్ ఇండియా రికార్డును దక్కించుకోవడం ఖాయం అంటూ ఆయన అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.