Begin typing your search above and press return to search.
బాలీవుడ్ ని గౌరవించాలన్న KGF స్టార్
By: Tupaki Desk | 23 Dec 2022 11:30 PM GMTప్రాంతాల మధ్య విద్వేషాలను రగిలించడం.. నిప్పు పెట్టడం రాజకీయ నాయకుల పని. కుయుక్తులు కుట్రలతో సినీ సెలబ్రిటీలకు సంబంధం ఉండదు. కానీ సెలబ్రిటీల్ని ఏదోలా రాజకీయ కుట్రల్లోకి లాగుతారు! కొందరు చెడును అంటగడతారు! అలాంటి ప్రయత్నమే యష్ విషయంలో జరిగిందా? అంటే... ఇటీవలి పరిణామాలు కొన్ని సందేహాలు రేకెత్తించాయి. సోషల్ మీడియాల్లో ఫ్యాన్ పేజీల పేరుతో విషం నూరిపోసే ఒక బాపతు ప్రజలు యష్ కి ఎదురవుతున్నారు.
తాజాగా యష్ చేసిన ఓ ప్రకటన `విభజన ఆలోచనల`ను వ్యతిరేకించేలా ఉండడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. హెచ్.నవీన్ కుమార్ గౌడ.. స్క్రీన్ నేమ్ యష్ తో పాపులరయ్యాడు. ఇటీవల కేజీఎఫ్ ఫ్రాంఛైజీ సంచలన విజయం సాధించడంతో KGF యష్ గా అంతా పిలుస్తున్నారు. అతడు రాజకీయ గొడవల కారణంగా ఏ పరిశ్రమను కించపరచడాన్ని ప్రోత్సహించనని తాజాగా వ్యాఖ్యానించడం సంచలనమైంది.
భారతదేశ ప్రజలుగా మనమంతా కలిసి జీవించాలని యష్ ఎంతో నిజాయితీగా మాట్లాడారు. బాలీవుడ్ ని పరిశ్రమగా గౌరవించాలని తన అభిమానులకు కర్ణాటక ప్రజలకు చెప్పాడు. పరిశ్రమతో అనుబంధం ఉన్న నటులుగా లేదా దర్శకులుగా నాణ్యమైన సినిమాలు రూపొందించడం వల్ల ప్రతి ఒక్కరికీ ప్రయోజనం ఉంటుందని అన్నారు.
కర్ణాటక ప్రజలు మరే ఇతర పరిశ్రమను అణచివేయాలని నేను కోరుకోవడం లేదు. బాలీవుడ్ ను గౌరవించాలని .. వారి సినిమాలు పనికిరానివని ప్రకటించొద్దని అభిమానులను అభ్యర్థించాడు. దేశంలో సినీపరిశ్రమలు ఎదిగేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నందున మరిన్ని థియేటర్లను నిర్మించాలనే లక్ష్యం ఉండాలని సూచించాడు. యువతరం తమ మధ్య తగాదాలు మానుకుని అంతర్జాతీయ వేదికలపై ఐక్యంగా పోటీపడాలని ఆయన గుర్తు చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలింస్ నిర్మించిన KGF 1 - KGF 2 లాంటి అత్యంత విజయవంతమైన చిత్రాలలో యష్ కథానాయకుడిగా నటించాడు. రాకీ భాయ్ గా తనదైన ముద్ర వేయడంలో సక్సెసయ్యాడు. అతడి నటనకు పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు దక్కాయి.
2022 మరపు రాని అనుభూతినిచ్చింది!
`కెజిఎఫ్: చాప్టర్ 2` బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టడంతో 2022 యష్ కి మరపురాని సంవత్సరంగా నిలిచింది. కెరీర్ లో అజేయంగా జైత్రయాత్రను కొనసాగించగలిగానని నటుడిగా తనను తాను నిర్మించుకున్నానని యష్ తెలిపాడు. పోరాడుతూ చనిపోతే ఫర్వాలేదు కానీ.. నిరాశతో ఉండకూడదని కూడా అన్నాడు. అతడు తనను తాను స్వయం ప్రేరిత నటుడిని అని కూడా చెప్పాడు.
కేజీఎఫ్ ఘనవిజయం తర్వాత చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి? ఇంత పెద్ద విజయం అందుకున్నారు. ఇకపై ఏం చేయబోతున్నారు? అంటూ అందరూ ప్రశ్నించారు. విజయం అందుకోగానే ఇప్పుడే విశ్రాంతి తీసుకోవాలని భావించే వ్యక్తిని నేను కాను. నేను పరిపాలన కోసం నిర్మితమైనవాడిని కాను.. చాలా జయించటానికి నిర్మితమైనవాడిని.. అని యష్ ఎంతో వినమ్రంగా తెలిపాడు. నాకు ఉత్సాహాన్ని ఇచ్చే పని నేను చేస్తాను. నేను పోరాడుతూ చనిపోతే ఫర్వాలేదు కానీ.. నన్ను ఉత్తేజపరిచే దాని కోసం పోరాడేవాడిగా ఉంటాను! అని అన్నాడు. `కెజిఎఫ్: చాప్టర్ 2` ప్రపంచవ్యాప్తంగా రూ. 1250 కోట్లకు పైగా వసూలు చేయడంతో యష్ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హీరోగా టాప్ పొజిషన్ లో నిలిచాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.