Begin typing your search above and press return to search.
'కేజీఎఫ్' టెక్నికల్ టీమ్ మట్టిలో మాణిక్యాలే!
By: Tupaki Desk | 22 April 2022 3:30 AM GMT`కేజీఎఫ్` ప్రాంచైజీ సక్సెస్ గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు భాగాలుగా రిలీజ్ అయిన `కేజీఎఫ్` పాన్ ఇండియా కేటగిరిలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇదంతా కేవలం దర్శకుడు ప్రశాంత్ నీల్..యశ్ ల కారణంగానే సాధ్యమైంది. ప్రశాంత్ రాసుకున్న `కేజీఎఫ్` కథకి అద్భుతమైన దృశ్యరూపాన్ని ఇవ్వడంలో ఆయన నూరుశాతం సక్సెస్ అయ్యారు. ఇలాంటి సినిమాలకు ఎలివేషన్స్ మాత్రమే కీలక పాత్ర పోషిస్తాయని కేజీఎఫ్ ద్వారా ప్రశాంత్ నీల్ రూపించాడు.
`కేజీఎఫ్-2` విషయంలో కథ లేదని..ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయని విమర్శలొచ్చినప్పటికీ...ఇలాంటి కథలకు ఎలివేషన్స్ అనేవి ఏ స్థాయిలో భూమిక పోషిస్తాయి అన్నది బాక్సాఫీస్ వద్ద ఫలితాలే సమాధానం చెబుతున్నాయి. ఇక సినిమా ప్రశాంత్ -యశ్ ఒక్కరే అయితే మరో ఇద్దరు-ముగ్గురు సినిమాకి పిల్లర్ లా నిలిచారు. వాళ్లే సంగీత దర్శకుడు రవి..ఎడిటర్ ఉజ్వల్...సినిమాటో గ్రాఫర్ భువన్. ఈ నలుగురు సినిమాని ఓ యజ్ఞంలా భావించి చేసారు కాబట్టే అంత బెస్ట్ ఔట్ ఫుట్ వచ్చింది.
దర్శకుడి ఐడియాలజీని...పల్స్ ని పట్టుకుని పని చేసారు కాబట్టే ప్రేక్షకులు మెచ్చే సినిమా అయింది. ఎలివేషన్స్ హైలైట్ చేయడంలో కెమెరా పనితనం..బ్యాక్ గ్రౌండ్ స్కోర్...ఎడిటింగ్ అనేవి ఎంత ముఖ్యం అన్నది ఈసినిమా చెప్పింది. ఈ రేంజ్ లో ఎలివేషన్స్ ఇవ్వడం అన్నది ఇండియన్ స్ర్కీన్ పై ఇదే తొలిసారి కావొచ్చు. ఈ సినిమాకి కీలక పాత్ర పోషించిన వీరంతా మట్టిలో మాణిక్యాలనే అనాలి.
మ్యూజిక్ డైరెక్టర్ రవి సాధారణ వడ్రంగి పని వారు. సంగీతం పై ఫ్యాషన్ తో దేవుడి పాటలు.. మ్యూజిక్ ఆల్బమ్స్ చేసేవారు. అలా ఓసారి ప్రశాంత్ కి తారస పడ్డాడు. తనలో ప్రతిభను గుర్తించి తొలి సినిమా `ఉగ్రమ్` లో అవకాశం ఇచ్చాడు. అక్కడ రవి తన పనితనం చూపించాడు. ఆ తర్వాత `కేజీఎఫ్` లో అవకాశం వచ్చింది.
ఇక సినిమాటోగ్రఫర్ భువన్ వాచీల రిపేర్ షాపులో పని చేసేవారు. ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో స్నేహితుడి కెమెరాతోనే ఎక్కువ సమయం గడిపేవాడు. భువన్ లో ఆ ఫ్యాషన్ చూసి `ఉగ్రం`లో అవకాశం ఇచ్చారు. ప్రశాంత్ విజన్ నిచక్కగా క్యాచ్ చేసి యాంగిల్స్ పెట్టడం అతన్ని `కేజీఎఫ్` వరకూ తీసుకొచ్చింది.
ఇక ఎడిటర్ 19 ఏళ్ల ఉజ్వల్ చిన్న చిన్న వీడియో ఎడిట్స్ చేసేవాడు. తన వర్క్ లో సిన్సియారిటీ..ఎడిటింగ్ స్టైల్ చూసి ప్రశాంత్ అతనికి `కేజీఎఫ్` లోకి తీసుకొచ్చారు. ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం ట్యాలెంట్ తో మాత్రమే పైకి వచ్చారు. యశ్..ప్రశాంత్ ఈనీల్ గతం గురించి తెలిసిందే. మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు వీళ్లు. ప్రస్తుతం వీరంతా దేశ వ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు.